ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి నాలుగు సంవత్సరాలు కావొస్తున్నా..ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదని..పైగా రాష్ట్రం ఎంతో అభివృద్ది చేస్తున్నాం అంటూ బూటకపు మాటలు చెప్పి పబ్బం గడుపుతున్న అధికార పార్టీపై వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ సమర శంఖం పూరించారు.  ఈ నేపథ్యంలో ఆయన ‘ప్రజా సంకల్పయాత్ర’ ప్రారంభించి ప్రజలను చైతన్య పరుస్తున్నారు.  ఎక్కడికి వెళ్లినా రాజన్న వచ్చారని జగన్ ని అక్కున జేర్చుకుంటున్నారు ప్రజలు.  ఇప్పటికే రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేశారు వైఎస్ జగన్. 

Image result for ysrcp

సీఎం చంద్రబాబు పై వైస్ జగన్ పంచ్ డైలాగులతో గణపవరం బహిరంగ సభ సాగింది. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త పెళ్లి కూతురు కోసం కాంగ్రస్ వైపు చూస్తున్నప్పుడు ప్రత్యేక హోదా అంశం గుర్తుకు వస్తుందని విపక్ష నేత జగన్ అన్నారు.బిజెపితో విడాకులు తీసుకున్న తర్వాతే చంద్రబాబుకు ఈ విషయం గుర్తుకు వచ్చిందని అన్నారు. నాలుగేళ్లపాటు బీజేపీతో కాపురం చేసి విడాకులు తీసుకున్న చంద్రబాబు... ఇప్పుడు కొత్త పెళ్లికూతురు (కాంగ్రెస్) వైపు చూస్తున్నారని ఎద్దేవా చేశారు.

Image result for chandrababu bjp
బీజేపీతో విడిపోయాక ఇతరులపై నెపం నెట్టేసేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు కంటే పెద్ద అబద్ధాల కోరు మరొకరు లేరని అన్నారు. కర్నాటక లో ఎమ్మెల్యేల కొనుగోళ్లు బాద కలిగించిందని చంద్రబాబు అంటున్నారని, ఆయన ఇక్కడ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్నారని, పైగా వారిలో నలుగురిని మంత్రులు చేసి,కర్నాటకపై మాత్రం ఇలా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.దర్మపోరాటం సభలో చంద్రబాబు అన్ని అబద్దాలు చెప్పారని జగన్ ద్వజమెత్తారు. 
Image result for chandrababu
రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని.... కాంట్రాక్టులు, మట్టి, ఇసుక, మద్యం, బొగ్గు, రాజధాని భూములు, గుడి భూములు, చివరకు గుడిలోని ఆభరణాలను కూడా వదలడం లేదని అన్నారు.గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాను తయారు చేశారని జగన్ మండిపడ్డారు. గ్రామంలో ఎవరికి ఏం కావాలన్నా లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: