పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే 2019 లో అన్ని స్థానాలకు పోటీ చేస్తానని ప్రకటించాడో అప్పటి నుంచి టీడీపీ పార్టీ ఓట్లు దెబ్బ తినే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే ముఖ్యంగా రాయలసీమ లో టీడీపీ కు దారుణ దెబ్బ తప్పదు అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా రాయలసీమ లో చిరంజీవి కి ఎక్కువ ఓట్లు పడ్డాయి. దీనితో కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేకూరింది.

Image result for pavan kalyan janasena

రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి సాలిడ్‌ ఓటు బ్యాంక్‌ ఉంది. చంద్రబాబు ఏంచేసినా, ఏం చేయకపోయినా, లోకల్‌ ఎమ్మెల్యేలు ఎంత దారుణంగా ప్రవర్తించినా తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఓటేసే జనాలు ఇక్కడ దండిగా ఉన్నారు. రాజకీయ సమీకరణాలు, వేవ్‌, ప్రభుత్వ వ్యతిరేకత.. ఇవేవీ కూడా వీళ్లను ప్రభావితం చేయలేవు. ప్రధానంగా బీసీ కులాల్లో తెలుగుదేశం పార్టీకి పట్టుంది. వీరితో పాటు సినీ అభిమానంతో ఇప్పటికీ టీడీపీని ఎన్టీఆర్‌ పార్టీగానే చూసే జనాలు, మాస్‌ ఓటు బ్యాంక్‌ తెలుగుదేశం పార్టీకి ప్లస్‌ పాయింట్లు.

Image result for pavan kalyan janasena

ఇవి మాత్రమే టీడీపీని గెలిపించకపోయినా.. ఈ ఓటు బ్యాంకు టీడీపీకి పునాదిగా నిలుస్తుంది. అలాంటి పునాదులు చిరంజీవి పార్టీతో కదిలాయి. ఎన్టీఆర్‌ దగ్గర నుంచి టీడీపీకి అతుక్కున్న ఓటు బ్యాంకు ఇప్పుడు చాలాదూరం అయ్యింది. ఇప్పుడు మళ్లీ పవన్‌ కల్యాణ్‌ వస్తే.. కనీసం ప్రతి ఎంపీ సీటు పరిధిలో 60, 70వేల ఓట్లను పక్కకు లాగినా తెలుగుదేశం పార్టీకి దిమ్మతిరిగే దెబ్బపడుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: