దేశ వ్యాప్తంగా ఈ రోజు నుంచి రెండ్రోజుల పాటు వేతనాలు పెంపుపై నిరసనగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె నిర్వహించనున్నారు.  తమకు మరింత మెరుగైన వేతనాలు కావాలని డిమాండ్ చేస్తూ, దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందికిపైగా బ్యాంకు ఉద్యోగులు మొదలుపెట్టిన రెండు రోజుల సమ్మె ఈ ఉదయం ప్రారంభమైంది. వేతన సవరణపై చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు విఫలం కావడంతోనే సమ్మెకు దిగత తప్పలేదని, మొత్తం 9 బ్యాంక్ ఎంప్లాయి అసోసియేషన్లు సమ్మెలో పాల్గొంటున్నాయని బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌ (ఏఐబీవోసీ) తెలియజేసింది. 
Bank unions to go on 48-hour strike from tomorrow - Sakshi
మే 5న జరిగిన సమావేశంలో ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) రెండు శాతం వేతనాల పెంపును ప్రతిపాదించగా.. యూనియన్లు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ‘మేము లేవనెత్తిన అంశాలన్నీ ఆమోదయోగ్యంగానే ఉన్నాయని చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ అభిప్రాయపడ్డారు. సానుకూలంగా స్పందించాలని ఐబీఏకి సూచించారు. ప్రజలు సాధ్యమైనంత వరకూ డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
bank-strike
కాగా, చెక్కుల క్లియరెన్స్ మినహా ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ తదితర బ్యాంకులు మామూలుగానే పనిచేయనుండగా, బారత బ్యాకింగ్ రంగంలో 75 శాతం వాటా ఉన్న 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడనున్నాయి. . ప్రతిపాదించిన 2 శాతం వేతన పెంపు ప్రస్తుత పరిస్థితుల్లో ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్స్‌ జనరల్‌ సెక్రటరీ డి.టి.ప్రాంకో తెలిపారు


మరింత సమాచారం తెలుసుకోండి: