ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదని కేంద్రం తేల్చినపుడు వైసీపీ నాయకుడు జగన్ మొదట సంధించిన అస్త్రం తన ఎంపీల  రాజీనామా. తన ఐదుగురు ఎంపీలతో రాజీనామా చేయించి ప్రత్యేకహోదా విషయంలో అధికారపక్షానికి ధీటుగా వ్యవహరించాడు. రాజీనామాల సంగతి అటుంచితే వాటిని స్పీకర్ ఇంకా ఆమోదించలేదు. మా రాజీనామాలను ఆమోదించండి అంటూ స్పీకర్ చుట్టూ తిరగడం వైసీపీ ఎంపీల వంతయింది. అయితే నిన్న వారు మళ్ళీ స్పీకర్ సుమిత్రా మహాజన్ తో నలభై నిమిషాల పాటు ఆమె ఛాంబర్ లో భేటీ కావడం జరిగింది. 


భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన స్పీకర్ కొన్ని ఆసక్తికర వాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాలలో మార్పులు చేసుకొనబోతున్నాయా అన్న సందేహాలను సృష్టించింది. రాష్ట్రాలకు సంబంధించి ఏ విషయంపైనైనా ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే ప్రజా ప్రతినిధులు చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు అని తెలిపింది. అందువల్లే ఏపీకి చెందిన పలువురు ఎంపీలు సైతం ప్రత్యేకహోదా ఇవ్వలేదన్న భావోద్వేగ సమయంలోనే తమ  పదవులకు రాజీనామాలు చేసినట్లుగా పేర్కొన్న ఆమె, అయితే వారు భావోద్వేగ అంశాన్ని తమ రాజీనామా పత్రాలలో ఎక్కడా పేర్కొనలేదని చెప్పింది.


అందుకే వారికి రాజీనామాలపై ఆలోచించుకోవలసినదిగా ఇంకొంత సమయాన్ని ఇచ్చినట్లు తెలిపింది. ప్రజాప్రతిధులు అన్న తరువాత ప్రజలకు బద్ధులై ఉంటే సరిపోదు, బాధ్యత కలిగి ఉండాలి అని చెప్పిన ఆమె, రాజీనామాలపై సరైన కారణం కోసం కూడా వారికి సమయం ఇచ్చినట్లు పేర్కొంది. జూన్ 5, 7 వ తేదీలలో మళ్ళీ వారితో సమావేశమవుతానని చెప్పిన ఆమె, అప్పటికీ వారు రాజీనామాలకు కట్టుబడి ఉంటే ఆమోదిస్తానని తెలిపింది. ఏది ఏమయినా వైసీపీ పట్టుబడితే జూన్ 5 వ తేదీనే రాజీనామాలను అమోదిస్తానని స్పీకర్ చిన్న హింట్ కూడా ఇచ్చేసింది. ఒకవేళ అదే జరిగితే ప్రత్యేకహోదాపై రాజీనామాల అస్త్రాన్ని వాడుకున్న జగన్ విజయం సాధించినట్లే, అంతేగాక ఈ చిన్నపాటి విజయంతో ఎన్నికలకు ప్రచారం కూడా చేసుకోవడం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: