టీడీపీ మహానాడు లో నేతలంతా బాబుకు భజన చేస్తూ, జగన్ ను విమర్సించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దీనికి బాబు గారు కూడా బాగా సంబర పడి పోయారులే... అయితే టీడీపీ తెలంగాణ నేత జగన్ పైన వేసిన చతురణలు ఆ పార్టీ బాగా హైలైట్ చేస్తుంది. దీనికి వైసీపీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ రాకపోయినప్పటికీ సినీ నటుడు పోసాని మురళి కృష్ణ తన దైనా శైలిలో రివర్స్ కౌంటర్ వేసినాడు. 

Image result for posani krishna murali

కుర్చీ ఖాళీ చేస్తే జగన్ కూర్చునిపోతాడేమో అన్నభయం సంగతి అటు వుంచి నర్సిరెడ్డి, కుర్చీ ఖాళీ చేయకుండానే, లాక్కుని మరీ కూర్చున్న పెద్దమనిషి చంద్రబాబును పక్కన పెట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడతావేమిటి? అని సూటిగా ప్రశ్నించాడు పోసాని. మామ కుర్చీ లాక్కున్నాడు. పార్టీలోకి గొడదూకి వచ్చి పార్టీని లాక్కున్నాడు. జెండా లాక్కున్నాడు. అన్నీ లాక్కున్న చంద్రబాబును వదిలేసి, లాక్కుంటాడు అంటూ జగన్ పై విమర్శలేమిటి? అని పోసాని సూటిగా ప్రశ్నించాడు. 

Image result for posani krishna murali

అయినా చంద్రబాబు వైనాన్ని పురందేశ్వరి, వెంకటేశ్వరరావు, రేణుకా చౌదరి, ఉపేంధ్ర ఇలాంటి తెలుగుదేశం సీనియర్ నాయకులు ఎందరో తూర్పారబట్టారు. ఇంకా ఎందరో తెలుగుదేశం నాయకులు పార్టీలోంచి బయటకు వెళ్లి నానా విమర్శలు చేసి, మళ్లీ లోపలకు వచ్చారు. రేవంత్ రెడ్డి సంగతేమిటి? మోత్కుపల్లి నర్సింహులు వైనమేమిటి? రేపో, ఎల్లుండో నర్సిరెడ్డి కూడా ఆ జాబితాలోకి చేరరని గ్యారంటీ ఏమిటి?


మరింత సమాచారం తెలుసుకోండి: