ఈ మద్య కాలంలో మానవ సంబంధాలు పూర్తిగా అంతరించి పోతున్న విషయం తెలిసిందే.  తమ అనుకున్నవారు చివరిదాకా మన వెంట వస్తారన్న నమ్మకం పూర్తిగా పోయింది.  వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్థాక్షిణ్యంగా రోడ్డున పడేస్తున్నారు.  స్నేహితులని అన్నీ అప్పగిస్తే..నిండా ముంచుతున్నారు.  ఇలా ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఇలాంటి దారుణాలు సోషల్ మీడియాలో చూస్తునే ఉన్నాం. అయితే ఏ రక్త సంబంధం లేకున్నా..ఒక మంచి పదవిలో కొనసాగుతున్నా ఓ నిరుపేద చనిపోతే అతని కుటుంబానికి ధైర్యం చెప్పి పాడె కూడా మోసాడు.
Image result for Rupjyoti Kurmi
జొర్‌హాట్ జిల్లాలోని మరియాని పట్టణంలో శుక్రవారం దిలీప్ డే అనే ఒక పేద వ్యక్తి చనిపోయాడు. కానీ ఆ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ లేరు. కనీసం శవాన్ని మోసుకెళ్లేందుకు కూడా సరిపోని జనం లేరు.  అయితే ఎమ్మెల్యే రూప్‌జ్యోతి కుర్మి అదే పట్టణం.  దిలీప్ మరణవార్త తెలుసుకున్న ఎమ్మెల్యే కుర్మి.. ఆ పేదోడి శవాన్ని మోసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. చనిపోయిన దిలీప్ చాలా పేదవాడని, కనీసం అంత్యక్రియలకు కూడా అతని వద్ద ఎవరూ లేరని, ఈ స్థానం నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను..అతని కోసం ఏదైనా చేయాలని ముందుకు వచ్చానని తెలిపారు.

బొంగు కర్రలతో చేసిన పాడెను ఎమ్మెల్యే మోయడం చూసి అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అదే రోజున ఓ ఆటోడ్రైవర్ తల్లి చనిపోతే.. ఆమె అంత్యక్రియల్లోనూ ఆయన పాల్గొన్నారు. మరియాని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కుర్మి మూడుసార్లు నెగ్గారు. కుర్మి తల్లి కూడా ఇదే నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించారు. ఆదివాసీల్లో మొదటి గ్రాడ్యుయేట్‌గా ఆమెకు గుర్తింపు ఉన్నది. ఎమ్మెల్యే రూప్‌జ్యోతి కుర్మి ఎన్నో సార్లు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  ఆ మద్య కాజిరంగా పార్క్‌లో వరదలు వచ్చినప్పుడు.. ఆయనే స్వయంగా 50 కేజీల బియ్యం బ్యాగ్‌ను రిలీఫ్ క్యాంపు వరకు మోసుకెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి: