కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ కుమార్ ల వ్యవహారం తెలంగాణలో ఆసక్తి కలిగిస్తోంది. వాళ్లిద్దరి సభ్యత్వాలను రద్దు చేయాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ విచారణార్హం కాదంటూ హైకోర్టు మొట్టికాయలు వేయడం వీళ్లద్దరికీ కలిసొచ్చింది. అయితే కోర్టు ఆదేశాలను పాటించకుండా టీఆర్ఎస్ మొండిగా వ్యవహరిస్తుండడంతో వీళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. కోమటిరెడ్డి, సంపత్ కుమార్ స్ట్రాటజీ టీఆర్ఎస్ కు ఏమోగానీ కాంగ్రెస్ కు మాత్రం కొత్త తలనొప్పులు తీసుకొస్తోంది.

Image result for komatireddy venkat reddy

ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్లు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వ రద్దు వ్యవహారం మొత్తం కాంగ్రెస్ ఏమ్మెల్యేల  చావుకు వచ్చినట్లే కనిపిస్తుంది. కోర్టు తీర్పునకు అనుకూలంగా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవటంతో ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని కోమటిరెడ్డి పట్టుబడుతున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దును కొట్టేసిన హైకోర్టు వారికి గతంలో ఉన్న ఎమ్మెల్యే హోదాను అన్ని విధాలా వర్తింపచేయాలని హైకోర్టు ఆదేశించింది. తమ తీర్పు తక్షణం అమలులోకి వస్తుందని కూడా స్పష్టం చేసింది. కానీ స్పీకర్ హైకోర్ట్ తీర్పును పరిగణలోకి తీసుకోలేదు. దీంతో తీర్పు వెలుబడిన తర్వాత సంపత్ కుమార్, కోమటి రెడ్డిలను ఎమ్మెల్యేలుగా పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆందోళన కూడా చేసింది..

Image result for komatireddy venkat reddy

హైకోర్టు తీర్పు వ్యవహారంలో స్సీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటంతో కోమటి రెడ్డి, సంపత్ కుమార్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా తమ తరుపున పోరాటం చెయ్యడం లేదని ఆగ్రహంగా ఉన్నారు.. ఎమ్మెల్యేలుగా తమను తిరిగి పురరుద్దరించటంతో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం ఆలస్యం అయితే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్దామని కోమటి రెడ్డి సూచించారు. దీనిపై స్పందించిన ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి విషయం అధిష్టానానికి చెప్పి పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకుందామని కోమటి రెడ్డికి సూచించారు..

Image result for komatireddy venkat reddy and high court

మూకుమ్మడి రాజీనామాలు చేస్తే మన వేలితో మన కన్ను పొడుచుకున్నట్లే అవుతుందని మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మధనపడుతున్నారు. రాజీనామాల తరువాత వచ్చే ఉపఎన్నికల్లో ఓటమి పాలైతే 2019 ఎన్నికలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుందనే భయంతో వణికిపోతున్నారు.. కానీ కొమటిరెడ్డి మాత్రం ఉపఎన్నికలు వస్తే కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా రాజీనామా చేయడానికి ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సాహసం చేస్తారా, లేదా వారికి నచ్చజెప్పి ఎమ్మెల్యే పదవులను పునరుద్దరించే వరకు పోరాటం చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మరి కోమటిరెడ్డి, సంపత్ ల వ్యవహారంపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేయబోతున్నారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: