గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతిలో పెను సంచలనాలు తెరపైకి వచ్చాయి.  మిరాశీ వ్యవస్థ రాజ్యాంగానికి వ్యతిరేకమని, వెయ్యికాళ్ల మండపాన్ని తొలగించడంపై ప్రధాన అర్చకులు రమణదీక్షితులు అధికార పార్టీపై, పాలక మండలిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ఈ విషయం ఢీల్లీ పెద్దల వరకు చేరడంతో మ్యాటర్ చాలా సీరియస్ అయ్యింది. తాజాగా తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని టీటీడీ మాజీ జేఈవో బాలసుబ్రహ్మణ్యం అన్నారు.

నెల్లూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తొమ్మిదిన్నరేళ్లు టీటీడీ జేఈవోగా పని చేశానని, పదిహేనేళ్ల పాటు దైవ సేవలో ఉన్నానని, రూపాయి ఆశించకుండా స్వామి వారి సేవ చేశానని అన్నారు.  అంతే కాదు మిరాశీ వ్యవస్థ రాజ్యాంగానికి వ్యతిరేకమని, వెయ్యికాళ్ల మండపాన్ని తొలగించవద్దని అప్పట్లో అధికారులకు తాను చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.

సుప్రీం కోర్టు తీర్పు మేరకే నాలుగు మాడ వీధుల్లోని నిర్మాణాలను తొలగించారని, బాధితులకు పరిహారం, శాశ్వత నివాస సదుపాయం కల్పించారని చెప్పారు.  తిరుమల శ్రీవారి నగలు, ఆభరణాలు మాయమయ్యాయన్నది అవాస్తవమని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: