రుతుపవనాలు పూర్తిగా రాకమునుపో మహారాష్ట్ర  తీర ప్రాంత అంతా భారీ వర్షాలతో సతమతమవుతుంది. నైరుతి రుతుపవనాల రాకతో మహారాష్ట్రలో గురువారం ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ముంబై నగరాన్ని మొత్తం ముంచెత్తింది. ముంబైలో సుమారు అరగంట పాటు కుండపోత వర్షం కురిసింది.

ఈ భారీ వర్షాలతో ఒర్లి, మాతుంగ సహా పలు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపై రెండు అంగుళాల మేర నీరు నిలవడంతో ట్రాఫిక్‌ జామ్ అయింది.   ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ వర్షాల కారణంగా పలు రైలు, విమాన సర్వీసులు రద్దయ్యాయి.

లండన్ నుంచి ముంబై వచ్చే జెట్‌ఎయిర్‌వేస్‌కు చెందిన విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించారు. లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ అధికారులను ఆదేశించారు. వర్షాలతో ఇబ్బంది పడే వారికి హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. కాగా, మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: