తెలంగాణలో ఈ మద్య రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి.  మొన్నటి వరకు తెలుగుదేశంలో ముఖ్యనేత, ఫైర్ బ్రాండ్ గా ఉన్న రేవంత్ రెడ్డి టీ కాంగ్రెస్ లోకి వెళ్లారు.  ఆయన తర్వాత ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నారు.  ఈ మద్య బీజేపీ నేతగా ఉన్న నాగం జనార్థన్ రెడ్డి కాంగ్రెసీ తీర్థం పుచ్చుకున్నారు.  ఒకప్పుడు వీరిద్దరూ టీడీపీలో కొనసాగిన వారే కావడం విశేషం.  అయితే నాగం జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంపై కొంత మంది సీనియర్ నేతలు పెదవి విరిచారు.
Image result for nagam janardhan reddy
తాజాగా నాగం జనార్దన్‌రెడ్డి టీడీపీలో బలమైన నాయకుడు కావొచ్చేమోగానీ కాంగ్రెస్‌లో కాదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. గత ఎన్నికలలో గెలవలేని నాగం బలమైన నాయకుడు ఎలా అవుతారు?.. బలమైన నాయకుడు అంటే లావుగా ఉండడం కాదు. ఒకవేళ బలమైన నాయకుడే అయితే కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చేవారు కాదు. 

అంతే కాదు ఎప్పటి నుంచో నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ కి అండదండగా ఉంటున్న వ్యక్తి మోదర్‌రెడ్డే అని, అలాంటి నాయకుడితో అధిష్టానం సంప్రదింపులు జరపకుండా నాగం ని పార్టీలోకి తీసుకోవడం సరైన పద్ధతి కాదని అన్నారు.

ఆయనకు సరైన ప్రాధాన్య ఇవ్వకపోవడంవల్లే మనసు మారి వేరే పార్టీవైపు మొగ్గు చూపుతున్నారని ఆమె అన్నారు. కాగా రేపు జరగనున్న సీఎల్పీ సమావేశానికి హాజరుకావడం లేదని రాహుల్‌ను ప్రధానిగా చూడాలన్నదే తన ఆశ అని వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: