పవన్ కళ్యాణ్ నెల రోజుల పాటు ఉత్తరాంధ్ర లో పోరాట యాత్ర చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ యాత్రలో ఎక్కువగా బ్రేకులు ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. అది కూడా పవన్ కళ్యాణ్ చేసేది పాదయాత్ర కాదు బస్సు యాత్ర అయనప్పటికీ పవన్ కళ్యాణ్ ఇప్పటికి చాలా సార్లు బ్రేక్ తీసుకున్నాడు. ఒక వైపు జగన్ పాదయాత్ర చేస్తుంటే మండే ఎండలను సైతం లెక్క చేయకుండా సాగిపోతున్నాడు. 

Image result for pavan kalyan janasena

30 రోజుల పాటూ ఉత్తరాంధ్రంలో తిరిగిన తర్వాత జనంతో కలిసిన తర్వాత.. వారి కష్టాలను విన్న తర్వాత... దృక్పథాలను గమనించిన తర్వాత.. పవన్ కల్యాణ్ ఏదో ఒక సాకు పెట్టి మొత్తానికి హైదరాబాదు చేరుకున్నారు. అంతవరకు బాగానే ఉంది... ఆ సందర్భంగా తాను ఏ రకంగా స్పందించబోతున్నాడో, వారికి దన్నుగా నిలవబోతున్నాడో ఆయన తన వేదిక ట్విటర్ ద్వారా పంచుకుని ఉంటే సబబుగా ఉండేది.

Image result for pavan kalyan janasena

ఉత్తరాంధ్ర గడ్డ మీద తనకు వీర తెలంగాణ స్ఫూర్తి కనిపించిందంటూ పవన్ చెప్పడం ఈ ప్రాంతవాసులకు గిట్టలేదు. తమ పోరాటాలకు ఒక అస్తిత్వం లేదా? తెలంగాణతో పోలిస్తే తప్ప తమ పోరాటాలు విలువైనవిగా కనిపించడం లేదా అని వారు బాధ పడుతున్నారు. తెలంగాణలో పార్టీ ఉంటుందో ఉండదో కూడా క్లారిటీగా చెప్పే పరిస్థితిలో లేని పవన్ కల్యాణ్.. తెలంగాణ పోలిక తెచ్చి.. ఉత్తరాంధ్ర వారి స్ఫూర్తిని అభినందించడంలో ఆంతర్యం ఏమిటో ఆయనకే తెలియాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: