మాటలు చెప్ప‌టంలో చంద్ర‌బాబునాయుడు క‌న్నా నాలుగు ఆకులు ఎక్కువే చదివారు బీజేపీ నాయకులు. జమ్మూ కాశ్మీర్లో అర్ధాంతరంగా మెహబూబా ముఫ్తీ సర్కార్ నుంచి బయటకొచ్చేసిన బీజేపీ విధానాన్ని ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు  బాగానే సమర్ధించుకున్నారు. తమ పార్టీకి సంబంధించి సిధ్ధాంతపరమైన,   విధానపరమైన నిర్ణయమది, అందువల్లనే బయటకు రావల్సివచ్చిందని చెప్పుకున్నారు. మరి తెలుగుదేశం పార్టీ  ఎన్డీఏ  నుంచి బయటకు రావడాన్ని మాత్రం రాజకీయమన్నారు. అంటే తాను చేస్తే సంసారం.. అదే మరొకరు చేస్తే ఏదో అన్నట్లుంది కదూ కమల నాధుల వైఖరి.  అచ్చం బాబు గారి లాగానే మన సోము కూడా బాగానే ముదిరిపోలా..

Image result for cm mehabuba masti

అంతా రాజకీయమేగా !
నిజానికి ఎన్నికల కోసమే అక్కడైన,, ఇక్కడైనా తలాక్ అన్నది.. ఆ సంగతి సామాన్యునికి కూడా తెలిసిపోయాక కూడా ఇంకా పాతివ్ర‌త్య కబుర్లు చెప్పడంలోనే బీజేపీ, టీడీపీ  బాగా పోటీ పడుతున్నట్లున్నాయ్.  ఎన్నికల వేళ మరో మారు దేశ భక్తి పేరు  చెప్పి ఓట్లు దండుకోవడానికే కాశ్మీర్ సర్కార్ ని మధ్యలోనే ముంచేసి బీజేపీ తెలివిగా ఒడ్డున పడింది. అదే థియరీని ఇక్కడ మన బాబు గారు ఉపయోగించారు. ఇందులో ఎవరు సుద్ద పూసలు కారన్నది తెలుస్తునే వుంది. కానీ సోము వీర్రాజు మాత్రం తమది నిఖార్సైన విధానమని చెప్పుకోవడమే సిసలైన పాలిట్రిక్స్.

Image result for chandrababu naidu

బాబు హామీలపై ఉద్యమిస్తారట !
నాలుగేళ్ళ క్రితం ఆరు వందలకు పైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన బాబు ఏ ఒక్కటీ అమలు చేయలేదని వీర్రాజు వీర లెవెల్లో ఫైర్ అవుతున్నారు. వీధి వీధిన వాడ వాడలా తిరిగి మరీ బాబు బాగోతం బయటేస్తామంటూ వార్నింగ్ ఇచ్చేశారు. తాము ఇచ్చిన  ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ హామీలపై మాత్రం అంతా మరచిపోవాలన్నది ఎవరూ పోరాడకూడదన్నదే కమల నాధుల వుద్దేశ్యం కామోసు. 

Image result for తిరుపతి క్షురకులు

హన్న..నాయీ బ్రాహ్మళ్ళనంటావా!
నాయీ బ్రహ్మళ్ళపై బాబు విరుచుకుపడడాన్ని తప్పు పట్టిన వీర్రాజు ఇందుకు సీయం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు తీరుతో రాజకీయ నాయకులే సిగ్గు పదాల్సి వస్తోందని వాపోయారు.  దళితులంటే బీజేపీకి ఎంతో ప్రేమ వుందన్న ఆయన తన విశాఖ జిల్లా టూర్లో భాగంగా భీమిలీలో పర్యటించి దళితవాడలో సహ పంక్తి భోజనం చేస్తాన్నారు. మొత్తానికి వీర్రాజు టీడీపీకి పదునైన  కౌంటర్లు ఇచ్చే  దమ్మున్న నేతగా బీజేపీలో బాగానే రాణిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: