రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరు జిల్లా గురించి ప్రత్యేకముగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో మంది రాజకీయ ఉద్దండులను దేశ రాజకీయాలకు కూడా అందించిన ఘాన చరిత్ర కలిగిన జిల్లా నెల్లూరు జిల్లా. అయితే ధనవంతుల పరంగా కూడా నెల్లూరు జిల్లా మొదటి స్థానం లో ఉంటుంది. అయితే ఈ జిల్లా లో టీడీపీ పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పాలి. ఇప్పటికే ఈ జిల్లా నుంచి టీడీపీ కి ఎంపికైన మంత్రుల సంఖ్య కూడా భారీగానే ఉంది. కానీ ఈ జిల్లా లో టీడిపి కి ఓట్లు వేసే జనాలు కనిపించడం లేదు. 

Image result for tdp party nellore

గత 35 ఐదేళ్లలో రెండు పర్యాయాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలవగలిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక చివరి సారిగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచింది 1999లో. ఆ తర్వాత అభ్యర్థులు ఎవరు పోటీ చేసినా సైకిల్ ఇక్కడ గెలవలేదు. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే.. వచ్చేసారి నెల్లూరు ఎంపీ సీటుకు టీడీపీకి అభ్యర్థి కూడా కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటి నుంచినే చంద్రబాబుకు ఇక్కడ అభ్యర్థిని రెడీ చేయడం భారమవుతోందట.

Image result for tdp party nellore

కాంట్రాక్టర్లను, వ్యాపారం నేపథ్యం ఉన్న వాళ్లను ఇక్కడ నుంచి పోటీకి ఉసిగొల్పుతున్నా.. వాళ్లు కూడా ఉత్సాహం చూపడం లేదని టాక్. ఎవరు పోటీ చేసినా ఈ సీట్లో గెలిచే అవకాశాలు అంతంతమాత్రంగా ఉండటం ఎంపీ సీటుకు పోటీ చేస్తే.. భారీగా ఖర్చు కూడా పెట్టుకోవాల్సి ఉండటంతో నేతలు ముందుకు రావడం లేదని సమాచారం. ఇటీవల జిల్లాలో జరిగిన టీడీపీ కార్యక్రమాల్లో ఎంపీ సీటుకు బై పోల్స్ వస్తే.. మీరు పోటీ చేయాలంటే మీరు పోటీ చేయాలని పార్టీలోని నేతలు బహిరంగంగానే వాదులాడుకోవడం గమనార్హం. 



మరింత సమాచారం తెలుసుకోండి: