సార్వత్రిక ఎన్నికలకు కనీసం ఏడాది కూడా సమయం లేదు. మరోవైపు ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తున్నాయనే ప్రచారం జోరందుకుంది. దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలకు డిసెంబర్ ను ముహూర్తంగా నిర్ణయించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో పరిస్థితి ఎలా ఉండబోతోందనేది దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్న అంశం.

Image result for tdp vs bjp

          నాలుగేళ్లుగా కలిసి కాపురం చేసిన బీజేపీ – టీడీపీ ఇప్పుడు విడిపోయాయి. రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజకీయ పార్టీల మధ్య ఈ మాత్రం మాటలు పేలడం సహజమే.! అయితే బీజేపీ చేస్తున్న పనులు, మాట్లాడుతున్న తీరు ఆ పార్టీకి లాభం చేకూర్చకపోగా మరింత నష్టం కలిగిస్తున్నాయేమోననే అనుమానాలు కలుగుతున్నాయి. ఇందుకు అనేక పరిణామాలను ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

Image result for tdp vs bjp

          వాస్తవానికి నాలుగేళ్ల తర్వాత రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ఎలాంటి న్యాయం చేయలేదంటూ బయటకు వచ్చేసింది టీడీపీ. అంతేకాక.. రాష్ట్ర ప్రజల్లో బీజేపీని ఓ దోషిగా నిలబెట్టింది. బీజేపీ ఎంత మొత్తుకున్నా రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ప్రజలను శాంతింపజేసేందుకు కాస్తోకూస్తో స్పందిస్తే బాగుండేది. స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ లాంటివాటిపై పాజిటివ్ నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది. అలా జరగకపోగా స్టీల్ ప్లాంట్ పై ఓ వైపు సీఎం రమేష్ దీక్ష చేస్తున్న సమయంలోనే స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించడం టీడీపీకి ప్లస్ అయింది. ఇక.. టీటీడీపై బీజేపీ చర్యలు రాష్ట్రప్రజలకు ఆగ్రహం తెప్పించడంతో పాటు ఆ పార్టీపై మరింత వ్యతిరేకతకు దారితీస్తున్నాయి. ఔనన్నా కాదన్నా తిరుమల వ్యవహారమంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందనే భావన రాష్ట్ర ప్రజల్లో బలంగా కనిపిస్తోంది. రమణదీక్షితులు వెనుక అమత్ షా ఉన్నారనేది బహిరంగ రహస్యంగా మారిపోయింది. మరోవైపు.. టీటీడీని కేంద్రం పరిధిలోకి తీసుకురావాలంటూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రానికి ఆర్థికంగానే కాక, ఆధ్యాత్మికంగా కీలకమైన పుణ్యక్షేత్రం తిరుమల. అలాంటి ఆలయాన్ని ఎలాగోలా తమ పరిధిలోకి తెచ్చుకోవాలని కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇవన్నీ రాష్ట్రప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు.

Image result for tdp vs bjp

          రాష్ట్రానికి మోడీ అన్యాయం చేశారని ప్రజలు బలంగా నమ్ముతున్న వేళ, ఇక్కడ బలపడేందుకు అనుకూల నిర్ణయాలు తీసుకోవాల్సిందిపోయి వ్యతిరేక చర్యలు తీసుకుంటుండడం మరింత ఆగ్రహానికి కారణమవుతోంది. మరోవైపు రాష్ట్ర బీజేపీ నేతలు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీని టార్గెట్ గా చేసుకున్నారు. అయితే అదేమంత లాభం చేకూర్చేది కాకపోగా నష్టం కలిగిస్తోంది. ఈ సమయంలో రాష్ట్రానికి ఇంతోకొంతో మేలు చేస్తే తప్ప బీజేపీకి ఉపయోగం ఉండదు. ఇదే స్ట్రాటజీతో బీజేపీ ముందుకెళ్తే చంద్రబాబు నెత్తిన పాలు పోసినట్లే.!  


మరింత సమాచారం తెలుసుకోండి: