ఇక ప్రతిపక్షాలే సమాధానం చెప్పాలి. పరిశీలించాలి. జాతికి విశదపరచాలి. కేంద్రంలో బిజెపి నాయకత్వలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన ఒక్క శాఖలోనే కోటి మందికి ఉద్యోగాలు వచ్చాయని ఉపాధి లభించిందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేలు, నౌకలు, జలవనరులు, నదుల అభివృద్ధి మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఉపాధి కల్పనపై ప్రతిపక్షాల చేస్తున్న ఆరోపణలను మంగళవారం ఆయన కొట్టిపారేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం లోని ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టాకే లక్షల ఉద్యోగాలు కల్పించిన విషయం నూటికి నూరు పాళ్లు నిజమని గడ్కరీ స్పష్టం చేశారు. 

Related image

"ప్రధాన మంత్రి చెప్పిందే నూటికి నూరుపాళ్ళు నిజం. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రగతి పథాన దూసుకుపోతోంది" అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విశదపర్చారు. తాను నిర్వహిస్తున్న శాఖల కింద 10లక్షల కోట్లతో ప్రాజెక్టులు చేపట్టినట్టు నితిన్ గడ్కరీ అన్నారు. ఈ విషయంలో ఎలాంటి చర్చకైనా తాను సిద్ధం గా ఉన్నానని ప్రతిపక్షాలకు ఆయన సవాల్ చేశారు. హైవేలు, షిప్పింగ్, పోర్టులు, నదుల అభివృద్ధి, జలవనరుల శాఖ కింద చేపట్టిన ప్రాజెక్టుపై వెల్లడించేందుకు గణాంకాలతో సహా సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు.

Image result for kashmir tunnel

"ఈ శాఖల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి దొరుకుతోంది. నా ఒక్కడి శాఖల్లోనే కోటి మందికి ఉద్యోగాలు లభించాయి" అని ఆయన నిర్ద్వందంగా వెల్లడించారు. 50వేల నుంచి లక్ష వరకూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరికిందని హైవేల మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాల చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన పేర్కొన్నారు. తమ శాఖలో చేపట్టిన ప్రాజెక్టులు, ఎందరికి ఉపాధి కల్పించింది సంబంధిత గణాంకాలు సేకరిస్తున్నామని నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీనికి సంబంధించి పలు అంశాలను ఆయన వివరించారు.

Image result for jobs to youth in nitin gadkari ministry

"మేం కాశ్మీర్‌ లో నిర్మిస్తున్న సొరంగం పనిలో రెండు వేల మంది యువత పనిచేస్తోంది. అలాగే జిజోలా టన్నెల్‌లో నాలుగు వేల మంది కంటే ఎక్కువ మందే కాశ్మీర్ యువత పనిచేస్తోంది. ఇలా చెప్పు కుంటూ పోతే వేలాది మందికి ఉపాధి దొరుకుతోంది" అని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. 
Related image
వాప్‌-కాస్ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్ 50 వ ఆవిర్భవదినోత్సవం సందర్భంగా మీడియాతో నితిన్ గడ్కరీ ముచ్చటించారు. గంగానది శుద్ధి కార్యక్రమంలో సంస్థ చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన ప్రశంసించారు. ఆరోపణలు చేయటమే కాదు కేంద్రం సమాధానాన్ని ప్రజానీకానికి ధృవపరచే బాధ్యత ప్రతిపక్షాలు వహిస్తే మంచిది. ఇక ఆయ చెప్పిన విషయం నిజమా? కాదా? అనే విషయం జాతికి ధృవ పరచవలసిన బాధ్యత ప్రతిపక్షాలదే. 

Image result for kashmir tunnel

మరింత సమాచారం తెలుసుకోండి: