ఈ సారి ఎన్నికలకు సుమారు ఒక సంవత్సరం గడువు ఉన్నా.. ఆ మధ్య కాలంలో ముందస్తు అంటే హడావుడి చేసి పరుగులెత్తడం.. పత్రికా, మరియు మీడియా సైతం దాన్ని పట్టుకొని సాగదీయటం.. చివరికి విషయం అంతకంతకూ కష్టతరంగా మారుతున్న సమయాన.. ముందస్తు లేదు ఏమీ లేదు.. షెడ్యూల్ ప్రకారమే అంటూ క్లారిటీ ఇచ్చిన వైనంతో ఎన్నికలు ఎప్పుడున్న హడావుడిని కాస్తంత తగ్గించింది భాజాపా ప్రభుత్వం. ఎన్నికలు ఎప్పుడన్న విషయంపై పక్కా క్లారిటీ వచ్చినా కూడా.. ఎన్నికల వేళ ఎలాంటి విమర్శలు ఉంటాయో.. ఇప్పుడు అలాంటివే చేస్తూ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.

Image result for modi

ఇక అసలు విషయానికొస్తే ఈ మధ్యనే కాంగ్రెస్ ముస్లిం పురుషుల పార్టీగా అవాంచిత వ్యాఖ్యలు చేస్తూ.. ట్రిపుల్ తలాక్ విషయంలో కాంగ్రెస్ తీరును తప్పుపట్టటం విదితమే. ఇదిలా ఉంటే.. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తప్పు పట్టి భాజాపాని ఎత్తిచూపగా .. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తనదైన రీతిలో మోడీకి పిడిగుద్దు వేశారు.ప్రస్తుతం భూ ప్రపంచమంతా 5జీ నెట్ వర్క్ తో ముందుకు దూసుకుపోతుంటే.. ప్రధాని మోడీ మాత్రం హిందూ.. ముస్లిం అంటూ చెత్త వ్యాఖ్యలు చేస్తూ కాలయాపన  చేస్తున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు.

Image result for cm kejriwal

ప్రపంచదేశాలు 5జీ నెట్ వర్క్ తో షరవేగంగా ముందుకు వెళుతుందని.. కానీ మన దేశంలో మాత్రం ఇప్పటికి 3జీ సరిగా పని చేయటం లేదన్నారు. దేశాన్ని టెక్నాలజీ పరంగా అభివృద్ధి పరచడం మానేసి హిందూ ముస్లింలు అంటూ ప్రధాని మత వైషమ్యాల్ని సృష్టిస్తున్నారని.. అంతకు మించి ఆయన ఇప్పటివరకు దేశాన్ని కొంతవరకైనా అభివృద్ధి పరచలేదని, ఆయన ఉండటం వల్ల దేశానికి ఒరిగింది ఏమీ లేదని ఆయన కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల కాలంలో ఆయనేం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. 


భారత కాంగ్రెస్ ముస్లిం పురుషుల పార్టీ అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. రానున్న రోజుల్లో రాజస్థాన్.. మధ్యప్రదేశ్.. ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ తరహా వ్యాఖ్యలుచేస్తున్నారని మండిపడ్డారు. మోడీ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర మనస్థాపానికి గురి అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: