జేసి దివాకర్ రెడ్డి ది ధైర్యమో , మొండితనమో ఎవరికీ అర్ధం కాదు. అయితే జేసి మాట్లాడేటప్పుడు తమ పార్టీ అధినాయకుడు ని కూడా లెక్క చేయడు . ఎందుకంటే అతని గెలుపు మీద ఉన్న నమ్మకమని చెప్పాలి. అయితే జేసి ఏది మాట్లాడిన వెటకారంగా ఉంటుంది. అతని మాట తీరు అంతే అని ఎవరు పెద్దగా పట్టించుకోరు..! అయితే అవిశ్వాస తీర్మానం మీద జేసి చేసిన వ్యాఖ్యలు టీడీపీ మీద అనుమానాలను రేకెత్తిస్తుంది. 

Image result for jc diwakar reddy

జేసి పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేది లేదని తేల్చిచెప్పేశారు. 'నాకు హిందీరాదు, ఇంగ్లీషూ రాదు.. నేనెందుకు పార్లమెంటుకు వెళ్ళాలి.? అయినా అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వమేమీ పడిపోదు కదా.!' అంటూ జేసీ దివాకర్‌రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అంతేనా, టీడీపీ విప్‌ జారీ చేసినాసరే, పార్లమెంటు సమావేశాలకు హాజరు కాబోనని తెగేసి చెప్పారు. జేసీ దివాకర్‌రెడ్డి రివర్స్‌ గేరునీ, సుజనాచౌదరి నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యల్నీ పరిశీలిస్తే, ఇదంతా తెలుగుదేశంపార్టీ మైండ్‌ గేమ్‌గా అర్థం చేసుకోవాలేమో.! పైకి అవిశ్వాసం.. లోపల మాత్రం ప్రధాని నరేంద్రమోడీకి వంగి వంగి దండాలు పెట్టేంత విశ్వాసం.. ఇదీ తెలుగుదేశం పార్టీ విధానం.

Image result for jc diwakar reddy

కాకినాడలో ఈరోజు ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌, టీడీపీ అవిశ్వాసంపై అనుమానాలు వ్యక్తంచేశారు. ఆ అనుమానాలే నిజమవుతున్నాయి. అవిశ్వాసం నోటీస్‌ని స్పీకర్‌ ఆమోదించిన రోజే, తెలుగుదేశం పార్టీ నుంచి ఓ వికెట్‌ డౌన్‌ అవడం, తెలుగుదేశం పార్టీలో 'రెండో స్వరం' విన్పిస్తుండడం చూస్తోంటే, పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని మరోమారు టీడీపీ మోసం చేస్తోందని అనుకోకుండా ఎలా వుండగలం.?

మరింత సమాచారం తెలుసుకోండి: