రాజ‌కీయాల్లో త‌మ‌కు పోటీ వ‌స్తార‌ని భావించే ప్ర‌తి నేత‌పైనా, ప్ర‌తి పార్టీపైనా స‌హ‌జంగానే విమ‌ర్శ‌లు వెల్లు వెత్తుతాయి. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితినే జ‌న‌సేనాని ప‌వ‌న్ కూడా ఎదుర్కొంటున్నాడు. నీతి వంత‌మైన రాజ‌కీయాలు, నిఖార్స‌యిన రాజ‌కీయాలు చేస్తాన‌ని ప‌దే ప‌దే చెప్పే ప‌వ‌న్‌కు ఇప్పుడు టీడీపీ నుంచి శ‌రాఘాతం వంటి వ్యాఖ్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఏపీ పాల‌న అంతా అవినీతి మ‌యంగా మారిపోయింద‌ని, సాక్షాత్తూ చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి లోకేష్ అవినీతి తిమింగ‌లాల‌తో చేతులు క‌లుపుతున్నార‌ని టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు. వాస్త‌వానికి ప‌వ‌న్‌.. త‌న రాజ‌కీయాల్లో చాలా పార‌ద‌ర్శ‌క‌త‌ను తీసుకు వ‌స్తాన‌ని ప్ర‌క‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు కూడా పార్టీ కార్య‌క‌ర్త‌లుగా కానీ, నేత‌లుగా కానీ ఎవ‌రినీ ప్ర‌క‌టించ‌లేదు. 

Image result for tdp

అయితే, ఆయ‌న చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు టీడీపీ ప్ర‌తి విమ‌ర్శ‌లు చేస్తోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీబీఐ చార్జీషీట్ వేసిన ఒక వ్యక్తితో టీవీ ఛానల్ కొనుగోలు చేయిస్తోందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఆ పార్టీ అధికార ప్రతినిది పంచుమర్తి అనూరాధ‌ ఒక ప్రకటన చేస్తూ కార్గిల్ యుద్ధంలో చనిపోయిన సైనికుల కుటుంబాల కోసం నిర్మించిన ఇళ్లలో అవినీతికి బాద్యుడని చెప్ప అబియోగాలు ఎదుర్కుంటున్న వ్యక్తితో పవన్ కళ్యాణ్ టీవీ ఛానల్ కొనుగోలు చేయిస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్రలో ఆయన ఐఏఎస్ అధికారిగా పనిచేసినప్పుడు ఇది జరిగిందని, అలాంటి వ్యక్తిని జనసేన ప్రదాన కార్యదర్శిగా పెట్టుకున్నారని ఆమె విమర్శించారు. ఇదేనా పవన్ కళ్యాణ్ నైతికత అని ఆమె అన్నారు. 

Image result for chandrababu lokesh babu

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే హక్కు ప‌వ‌న్‌కు లేదని అనూరాధ‌ అన్నారు. ఇక‌, పవన్ కళ్యాణ్ బౌన్సర్ల ను వెంటేసుకుని తిరగడం కాదని కూడా ఆమె వ్యాఖ్యానించారు. రాజ‌కీయంగా ప‌వ‌న్‌ను ఈ వ్యాఖ్య‌లు ఇబ్బందుల‌కు గురి చేసేవే!  తాను ఒక‌ప‌క్క పార‌ద‌ర్శ‌క‌మైన రాజ‌కీయాలు చేస్తున్నాన‌ని ఆయ‌న అంటున్నారు. అయితే, ఇప్పుడు పార్టీలో కీల‌క స్థానాన్ని మ‌హారాష్ట్ర‌లో హౌసింగ్ కుంభ‌కోణంలో చేతులు క‌లిపార‌ని సాక్షాత్తూ సుప్రీం కోర్టు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన అధికారిని పార్టీలో చేర్చుకోవ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇది నిజానికి ప‌వ‌న్‌కు ఇజ్జ‌త్ కా స‌వాల్‌గా మారిపోయింది. మ‌రో ప‌క్క‌, అధికార టీడీపీ నేత‌లు అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని విమ‌ర్శిస్తున్న ఆయ‌న‌పై ఇప్పుడు టీడీపీ చేసిన విమ‌ర్శ‌లు శ‌రాఘాతాలుగా త‌గులుతాయ‌ని చెబుతున్నారు ప‌రిశాల‌కులు. మ‌రి వీటికి ప‌వ‌న్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: