విశాఖ జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీకి మరింత దూరమయ్యారు. విశాఖలో జరిగిన పార్టీ అత్యవసర మీటింగ్ కు డుమ్మా కొట్టి అలుగుటయే ఎరగని  జిల్లా  ఇంచార్జ్ మంత్రి చిన రాజప్పకే కోపం తెప్పించారు. దాంతో ఇదే అంశంపై   టీడీపీ మీటింగ్ లో హాట్ హాట్ డిస్కషన్ జరిగింది. మంత్రి తీరుపై మరో మంత్రి అయ్యన్నతో పాటు, పలువురు ఎమ్మెల్యేలు కూడా చిన రాజప్ప వద్ద ఫైర్ అయ్యారు. ఇదేమి  పద్దతి అంటూ గంటానే టార్గెట్ చేశారు. ఇంచార్జ్ మంత్రిగా ఏదో ఒక యాక్షన్ తీసుకోండంటూ గట్టిగా కోరారని భోగట్టా. 


సీఎం కి కంప్లైంట్ చేస్తా :


జిల్లాలో సీనియర్ మంత్రిగా ఉంటూ పార్టీ కీలకమైన సమావేశాలకు డుమ్మా కొట్టడంపై చిన రాజప్ప కూడా తీవ్ర అసంత్రుప్తిని వ్యక్తం చేశారు. పార్టీ కంటే ఎవరూ గొప్ప వారు కాదని కూడా గంటాకు సెటైర్లు వేశారు. పార్టీ బాగుంటేనే ఎవరైనా  ఎమ్మెల్యే, మంత్రి అయ్యేది అంటూ ఘాటుగానే గంటాపై కామెంట్స్ చేసారు. ఈ విషయాన్ని తాను కూడా సీరియస్ గానే తీసుకున్నానని, ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకువస్తానంటూ సమావేశంలో నాయకులకు చిన  రాజప్ప స్పష్టం చేసినట్లు భోగట్టా.


అయన బాగా బిజీ :


పార్టీ మీటింగ్ కు గంటా ఎందుకు రాలేదో మీడియానే  ఆయనను అడిగి తెలుసుకోవాలంటూ రాజప్ప అన్నారు. ఈ విషయాన్ని మీడియా ప్రస్తావించినపుడు ఆయన ఒకింత అసహనానికి లోనయ్యారు. గంటా బాగా బిజీ అంటూ సెటైర్లు వేసిన రాజప్ప ఎవరు వచ్చినా రాకపోయినా తెలుగుదేశానికి ఏమీ కాదన్న ధోరణిలో మాట్లాడడం విశేషం. పార్టీ మీటింగులు ఒకరు రాలేదని ఆగేవి కావని కూడా అన్నారు.


వైసీపీ వైపేనా !


ఇదిలా ఉండగా గంటా ఫ్యూచర్ ఏంటన్నది తెలిసిరావడం లేదు. ఆయన టీడీపీకి కావాలని దూరమవుతున్నారా లేక, తన డిమాండ్లపై బాబుతోనే తేల్చుకోవాలనుకుంటున్నారా అన్నది అర్ధం కావడం లేదు. మరో వైపు తమ పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామంటూ సీనియర్ వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అంటున్నారు. చూడబోతే వచ్చే ఎన్నికలలో వైసీపీ కండువా కప్పుకుంటారని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: