జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడైతే కాపు రిజర్వేషన్స్ గురించి నేను హామీ ఇవ్వలేనని చెప్పాడో టీడీపీ పాత పల్లవే  అందుకున్నది. జగన్ మోసగాడు. అతను మనిషే కాదు అంటున్నారు. అస్సలు జగన్ ఏమన్నాడు అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశం కాదు అని చెప్పినాడు. దాన్ని పట్టుకొని టీడిపి నానా యాగీ చేస్తుంది. అదేదో టీడీపీ మాత్రం కాపులకు న్యాయం చేసినట్లు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. 2014 లో కాపులను మోసం చేసింది టీడీపీ నే అని అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడూ యనమల రామకృష్ణుడు జగన్ మాట్లాడిన మాటలనే మాట్లాడినాడు. అంటే జగన్ ను సమర్ధించినట్టే కదా..!

Image result for jagan

తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తోన్న ప్రజాసంకల్ప యాత్రను అడ్డుకునేందుకు 'కాపు రిజర్వేషన్ల' వ్యవహారానికి మరింత మషాలా దట్టించి మరీ, తెలుగుదేశం పార్టీ నానా యాగీ చేస్తోన్న ఈ సమయంలో అదే తూర్పుగోదావరి జిల్లాకి చెందిన మంత్రి యనమల రామకృష్ణుడు.. 'కాపు రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోనిది కాదు..' అని వ్యాఖ్యానించడంతో అంతా షాక్‌ అవ్వాల్సి వస్తోంది. అయితే ఇదే విషయాన్ని జగన్ చేప్తే మీడియా నానా హంగామా చేసింది. జగన్ చెప్పిందే ఇప్పుడూ యనమల చెప్పాడు. అయితే ఇప్పడూ మీడియా ఏమంటుందో చూడాలి..!

Image result for jagan

యనమల వ్యాఖ్యలతో, ఒక్కసారిగా వైఎస్సార్సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కన్పిస్తోంది. కాపు రిజర్వేషన్ల విషయంలో టీడీపీ వైఖరేంటో యనమల వ్యాఖ్యల్లోనే స్పష్టమవుతోందని అంటున్నారు వైఎస్సార్సీపీ నేతలు. ఇందులో నిజం లేకపోలేదు కూడా. నిజానికి, హామీలిచ్చి పిల్లిమొగ్గలేయడం టీడీపీకి కొత్తకాదు. చంద్రబాబు అంటేనే, మాటతప్పడం, మడమ తిప్పడం వంటివాటికి బ్రాండ్‌ అంబాసిడర్‌. 



మరింత సమాచారం తెలుసుకోండి: