ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రతి నిరుద్యోగి జేబులో వేయేసి రూపాయలు పెడుతున్నాం పండుగ చెసుకోమంటోంది బాబు సర్కార్. మరి రెండు వేలన్నారు. అదీ 2014 జూన్ నుంచి అన్నారు. అంటే చరిత్ర అడగకు, ఇచ్చింది పుచ్చుకోమంటోంది. పైగా ఇది ప్రపంచలొనే  ఎక్కడా లేని అతి గొప్ప స్కీం అని కూడా డప్పాలు కొడుతోంది.


బకాయి సంగతేంటి :


అయితే నిరుద్యోగ లోకం మాత్రం ఈ డబాయింపునకు, ఆర్భాటానికి ఎక్కడా తగ్గడంలేదు. మాకు పాత బాకీలతో పాటు, ఎన్నికల టైంలో చెప్పినట్లుగానే  నెలకు రెండు వేలు ఇవ్వాల్సిందే అంటోంది. లేకపోతే మళ్ళీ పోరాటామే చేస్తామని హెచ్చరిస్తోంది. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ విధ్యర్ధులు వేయి రూపాయల భ్రుతి ఏంటని ఓ రేంజిలో ఫైర్ అవుతున్నారు. ఏయూ గేట్ వద్ద ఆందోళనలు నిర్వహించిన విధ్యార్ధి నాయకులు బాబు విధానాలపై  మండిపడ్డారు.


లక్ష రూపాయలు ఇవ్వాల్సిందే :


ఎన్నికలు ముంగిట్లో పెట్టుకుని బాబు మరోసారి నిరుద్యోగులను మభ్య పెట్టేందుకే వేయి రూపాయలంటున్నారని విమర్శించారు. నిజానికి ఎన్నికలలో బాబు చెప్పింది నెలకు రెండు వేల రూపాయలు, ఆయన ముఖ్యమంత్రిగా జూన్ లో బాధ్యతలు తీసుకున్నారు. ఆనాటి నుంచి లెక్క కడితే ఇప్పటికి యాభై నెలలు అవుతుందని చెప్పుకొచ్చారు. అందువల్ల ప్రతి నిరుద్యోగికి లక్ష రూపాయలు వంతున ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. మాట నిలబెట్టుకోకపోతే నిరుద్యోగ యువత మరింతగా పోరాటాలు చేసి బాబు విధానాలు ఎండగడుతుందని వారంతా స్పష్టం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: