కరుణా నిధి తన జీవితం చివరి వరకు ప్రజల సేవకే అంకితం చేసినాడు. రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవం.. ఈ దేశం లో ఇలాంటి రికార్డు ఉన్న నేత మరొకరు దొరకరేమో... ఆయితే కరుణా నిధి చనిపోయినప్పుడు కూడా అతని అంత్య క్రియల విషయం లో హైడ్రామా జరిగింది. చెన్నయ్‌లోని మెరీనా బీచ్‌లో ఖననం చేయాలంటూ డీఎంకే శ్రేణులు నినదించాయి. కానీ, ప్రభుత్వం ఒప్పుకోలేదు. అన్నాదురై, ఎంజీఆర్‌, జయలలిత ఇక్కడే శాశ్వత నిద్రలోకి చేరుకున్నారు. 

Image result for karuna nidhi

అయితే, డీఎంకే అంతతేలిగ్గా ఈ వ్యవహారాన్ని విడిచిపెట్టాలనుకోలేదు. రాత్రికి రాత్రి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అంతకు ముందు మెరీనా బీచ్‌లో 'ఖననం, స్మారక స్థూపాల' విషయమై న్యాయస్థానాల్ని ఆశ్రయించిన వారితోనూ సంప్రదింపులు జరిగాయి. రాత్రికి రాత్రి, 'మెరీనా బీచ్‌లో ఖననం, స్మారక స్థూపాలకు వ్యతిరేకంగా పిటిషన్లు వేసినవారు' తమ పిటిషన్లను వెనక్కి తీసుకున్నారు. న్యాయస్థానంలో, ప్రభుత్వ వాదన వీగిపోయింది. కరుణానిధి అంత్యక్రియలు చెన్నయ్‌ మెరీనా బీచ్‌లోనే జరగడానికి మార్గం సుగమం అయ్యింది. 

Image result for karuna nidhi

మరణం తర్వాత కూడా తన పార్తీవ శరీరానికి అంత్యక్రియల విషయమై 'పోరాడి గెలిచారు' అంటూ డీఎంకే శ్రేణులు చెమర్చిన కళ్ళతో నినదించడం గమనార్హం. కోర్టు తీర్పురాగానే, కరుణానిధి పార్తీవ దేహాన్ని వుంచిన రాజాజీ హాల్‌లో భిన్న వాతావరణం కన్పించింది. ఓవైపు కరుణానిధి లేరన్న బాధ, ఇంకోవైపు కరుణానిధి అంత్యక్రియల విషయమై మెరీనా బీచ్‌ వద్దనే చోటు దక్కిందన్న ఆనందం.. డీఎంకే శ్రేణుల్లో కన్పించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: