టీడీపీ మీద అవినీతి ఆరోపణలు కొత్తేమి కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం విషయం లో ప్రధాన అర్చకులు చేసిన అవినీతి ఆరోపణలు మనకు తెల్సిందే. అయితే అది మరువక ముందే ఈ సారి ఏకంగా అడ్డంగా బుక్కయ్యారు. అమ్మవారికి పెట్టిన సారె చీరను దొంగిలించారని చెప్పుకుంటున్న కోడెల సూర్యలత ట్రస్ట్ బోర్డు సభ్యురాలే కాదు, ఏకంగా విజయవాడ అర్బన్ తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు కూడా కావడంతో పాలకులు ఇరుకునపడ్డారు.

Image result for chandrababu naidu

కంటిముందున్న చీరను దొంగిలించి బుకాయించిన ఇటువంటి టీడీపి నాయకురాలు, ధర్మకర్తగా అమ్మవారి నగలకు ఎలాంటి 'భద్రత' కల్పిస్తారనేది ఇప్పుడు అందరి అనుమానం. గతంలో ఇదే ఆలయంలో జరిగిన క్షుద్రపూజల అంశం కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. క్షుద్ర పూజల పేరుతో అర్హత లేని వారికి గర్భాలయ ప్రవేశం కల్పించడం, ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఆలయంలో క్షుద్రపూజలు చేయడం, సరిగ్గా అదే సమయంలో సీసీటీవీ ఫుటేజీ లేకుండా చేయడం.. అన్నీ పద్ధతి ప్రకారమే జరిగాయి. ఈ అపచారాలను దుర్గమ్మ క్షమిస్తుందా..!

Image result for chandrababu naidu

ఇక రాష్ట్రంలో బాబు పాలనే అపచారాలతో మొదలైంది. గోదావరి పుష్కరాల సమయంలో కోట్ల రూపాయల మేర అవినీతి సొమ్ముని టీడీపీ నేతలు బొక్కేశారు, యాత్రికుల రక్షణ గాలికొదిలేశారు. చంద్రబాబు ప్రచార యావకు 27మంది ప్రాణాలు బలయ్యాయి. ఆ కుటుంబాల ఘోష చంద్రబాబు సర్కారుకు తగలకుండా ఉంటుందా? టీటీడీ విషయానికొస్తే పాలక మండలిని ఓ వ్యాపార మండలిగా మార్చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: