“ట్రాన్స్ ట్రాయ్” తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఈ కంపెనీ గురించి పరిచయం ఏమాత్రం అక్కర్లేదు. దాని నేపధ్యంలో ఉన్న అతిపెద్ద వ్యాపార రాజకీయవేత్త రాయపాటి సాంబశివరావు గురించి కూడా వివరించాల్సిన అవసరం లేదు. సుదీర్ఘ రాజకీయ జీవితం వ్యాపార దక్షత వ్యూహాత్మకంగా వ్యవహరించట్మ్ రాయపాటి ప్రత్యేకత. తొలి నాళ్ళ నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన రాయపాటి గత ఎన్నికల సమయంలో,  బలమైన లాబీయింగ్ కు పెట్టింది పేరయిన రాయపాటి నూతన అవకాశాలని స్వంతం చేసుకోవటానికి ఇతరత్రా ఈక్వేషన్లను ఉపయోగించుకొని మెల్లగా తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి అధ్యక్షుని స్థానం అందిపుచ్చుకోవటానికి కూడా తీవ్రంగా ప్రయత్నించారు.
సంబంధిత చిత్రం
ఒకానొక దశలో, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును సైతం ఖంగు తినిపించారు. చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పు తారని - తను అనుకున్న పనులను అనుకున్నట్లుగా, చకచకా చేసే మానేజ్మెంట్-టెక్నిక్స్ విషయంలో దేశంలోనే ఆరితేరినవ్యక్తి  అనే ప్రచారాన్ని త్రోసిరాజని తన కంపెనీ కి వ్యూహాత్మకంగా రాయపాటి ప్రయోజనాలు పొందగలిగారు. 
trans troy relation with rayapati sambasiva rao కోసం చిత్ర ఫలితం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకుపోతున్న “పోలవరం ప్రాజెక్టు” నిర్మాణపనుల్లో ట్రాన్స్-ట్రాయ్ సంస్థ విఫల మైందనే అభిప్రాయం ఉన్న సంగతి తెలిసిందే. అయితే పోలవరం పనులు అనుకున్న రీతిలో జరగని నేపథ్యంలో కాంట్రాక్టరును మార్చేయాలని చంద్రబాబు నిర్ణయించుకుని, విషయాన్నికేంద్రమంత్రి గడ్కరీకి తెలియజేయగా, ప్రస్తుత కాంట్రాక్టరును మార్చేది లేదని ఆయన తేల్చిచెప్పినట్లు సమాచారం. ఈ పరిణామం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అది రాయపాటి వ్యూహాత్మక వ్యవహారాత్మక రాజకీయ సామర్ధ్యం. “తాడిని తన్నే వాడుంటే వాడి తలదన్నేవాడు” తరహా వ్యక్తి రాయపాటి.
సంబంధిత చిత్రం
అలాంటి సమర్ధుడైన ఈ నరసారావుపేట పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావుకు తాజాగా “షాక్” ల కేకులు తినే పరిణామం ఎదురైంది. రాయపాటికి చెందిన  ట్రాన్స్-ట్రాయ్ కంపెనీ కార్యాలయాలపై  "సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్" (సిజిఎస్టి) అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ట్రాన్స్-ట్రాయ్ సంస్థకు చెందిన కార్పొరేట్ కార్యాలయంపై  దాడులు నిర్వహించారు. పెద్ద ఎత్తున పన్ను ఎగ్గొట్టారని పేర్కొంటూ అధికారులు సోదాలు చేశారు. ఈ పరిణామం రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారింది. 
nitin gadkari rayapati కోసం చిత్ర ఫలితం
2012లో పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును ట్రాన్స్-ట్రాయ్ దక్కించుకుంది. అయితే  ఇటీవలి కాలం లో పనులు అనుకున్నంత వేగంగా సాగడం లేదని, అసల్యు  ట్రాన్స్-ట్రాయ్  కంపెనీ కి పోలవరం లాంటి జాతీయ ప్రోజెక్ట్ ను నిర్మించే సామర్ధ్యం లేదని – అందుకే దానికి బదులుగా మరో కంపెనీకి ఆ కార్యకలాపాలు అప్పగించే కసరత్తు చంద్రబాబు సాగించిన దరిమిలా, దాన్ని రాయపాటి విజయవంతంగా ఎదుర్కొని అందులో విజయం సాధించారు. దీంతో సాంబశివుని ముందు వ్యవహారంలో మన చంద్రుడు ధారుణంగా వెలవెలపోయారు. 
trans troy relation with rayapati sambasiva rao కోసం చిత్ర ఫలితం
ఈ సిజిఎస్టి  సోదాలపై ప్రశ్నలకు రాయపాటి సాంబశివరావు స్పందింస్తూ, తన కార్పొరేట్ కార్యాలయంపై దాడులు జరిగినమాట వాస్తవమేనని పోలవరం పనులకు అడ్డంకు లు సృష్టించేందుకు ఈ దాడులు చేస్తున్నారని అన్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయంగా కక్షసాధింపు చర్య మాత్రమేనని అన్నారు.  అయితే తన రాజకీయ శత్రువు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కు ఈ దాడులకు కారణమని అనుమానం రేకెత్తే స్వరంలో మాట్లాడారు. అంతేకాదు ఆంధ్ర ప్రదేశ్  లో అత్యంత అవినీతిపరుడు కన్నా లక్ష్మీ నారాయణ అని ఎంపీ రాయపాటి అపష్టం చేశారు.  
సంబంధిత చిత్రం
ఈ సందర్భంగా రాయపాటి మాట్లాడుతూ, ఎక్కడ పోటీ చేసినా కన్నా లక్ష్మీనారాయణ గెలవలేరని, సీబీఐని, ఈడీని తనపై ప్రయోగించి తనను తన కంపనీని వేధింపులకు గురిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నుంచి తమ కంపెనీకి రావలసిన బకాయిలు రాగానే కేంద్రానికి జీఎస్టీ చెల్లింపులు చేస్తామని అన్నారు. ఆయితే కేవలం కన్నా లక్ష్మినారాయణ  - రాయపాటిసాంబశివరావు ల మధ్య ఉన్న విభేదాలు వివాదాల వల్లే సోదాలు జరిగాయా?  లేక ఏవైనా రాజకీయ వ్యాపార వ్యవహార  కారణాలన్నాయా? అనేది ఇప్పుడు అమరావతిలోనే కాదు ఉభయ తెలుగురాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

kanna lakshminarayana images కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: