రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏ మంత్రం జ‌పించాలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు తెలిసినంత‌గా మ‌రెవ్వ‌రికీ తెలియ‌దంటే అతిశ‌యోక్తి కాదేమో. ఒక అంశాన్ని చ‌ర్చ‌నీయాంశంగా మార్చ‌డం.. ఆత‌ర్వాత దానిని చ‌ల్లార్చ‌డం.. అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు మ‌ళ్లీ దానికి తెర‌పైకి తేవ‌డంలో బాబుగారు ఆరితేరారు.. ఎంతైనా.. దేశంలోనే సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న‌నేత క‌దా..? అందుకే అడుగుబొడుగుల‌న్నీ ఆయ‌న‌కు బాగా తెలుస్తాయి. వాటిని ముందే ప‌నిగ‌డుతారు. ఇప్పుడు  ఈ ముచ్చ‌టంతా ఎందుకంటే.. కొద్దిరోజులుగా బాబుగారి నోటి వెంట కొత్త మాట‌ విన‌బడుతోంది. అదేమిటంటే... మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌. 

Image result for chandrababu naidu

అస‌లే ముంద‌స్తు రాగం విన‌బ‌డుతున్న సంద‌ర్భం.. ఎన్నిల‌కు ఏడాది స‌మ‌యం కూడా లేని వేళ‌.. బాబుగారు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ మంత్రం చ‌ద‌వ‌డంలో ఏద మ‌త‌ల‌బు ఉండే ఉంటుంది. అదేమిటోగానీ.. నాలుగేళ్లుగా ముస్లింల‌పై పెద్ద‌గా దృష్టి సారించ‌ని చంద్ర‌బాబు ఈ మ‌ధ్య తీరుమార్చుకున్నారు. ముస్లిం సామాజిక‌వ‌ర్గానికి ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎన్డీయే నుంచి బ‌య‌కుట వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాలు తెలిసిన‌వే.. ఏపీలో దాదాపుగా న‌ల‌భై నియోజ‌క‌వ‌ర్గాల్లో ముస్లిం ఓట‌ర్లు గెలుపు ఓట‌ముల‌ను ప్ర‌భావితం చేసే స్థాయిలో ఉన్నారు. నిజానికి గ‌త ఎన్నిక‌ల్లో ముస్లిం ఓట‌ర్ల ప్ర‌భావిత నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్కువ మొత్తంలో వైసీపీ సీట్ల‌ను గెల్చుకుంది. ఇప్పుడు బీజేపీకి దూర‌మైన వేళ‌.. వారికి ద‌గ్గ‌ర‌య్యేందుకు రెండు మూడు ప్లాన్లు వేస్తున్నారు బాబుగారు. 

Image result for bjp

ఇటీవ‌ల ముస్లిం సామాజిక‌వ‌ర్గ పెద్ద‌ల‌తో బాబు భేటీ అయ్యారు. మొద‌టి విడ‌త‌లో హ‌జ్ యాత్రిల‌ను పంపించారు. మ‌రికొద్ది రోజ‌ల్లోనే ముస్లింల పెద్ద‌ల‌తో ఆయ‌న స‌మావేశం నిర్వ‌హించేందుకు స‌న్న‌ద్దం అవుత‌న్నారు. ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత కేంద్రంలోని ఇద్ద‌రు టీడీపీ మంత్రులు, రాష్ట్రంలోని ఇద్ద‌రు బీజేపీ మంత్రులు రాజీనామాలు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ఆ రెండు స్థానాల‌ను భ‌ర్తీ చేయ‌లేదు. అయితే కొద్దిరోజులుగా ఈ నెలాఖ‌రులో ఏపీలో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌నే టాక్ వినిపిస్తోంది. 

Image result for muslims

అయితే... ఖాళీగా ఉన్న ఈ రెండు మంత్రి ప‌ద‌వుల్లో ఒక‌టి ముస్లిం సామాజిక‌వ‌ర్గానికి క‌ట్ట‌బెట్టాల‌నే ఆలోచ‌న‌లో చంద్ర‌బాబు ఉన్న‌ట్లు తెలిసింది. ఇందుకు ఇద్ద‌రు ముగ్గురి పేర్ల‌ను కూడా సీఎం చంద్ర‌బాబు ప‌రిశీలిస్తున్న‌ట్లు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముస్లింల ఓట్ల‌ను ద‌క్కించుకోవ‌డానికి ఆయ‌న ఇప్పుడు ఈ మంత్రం జ‌పిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా.. కేంద్రంతో చంద్ర‌బాబు బంధం పూర్తిగా తెగిపోయిందంటే.. ముస్లింలు మాత్రం అంత‌గా న‌మ్మ‌డం లేదు మ‌రి. 


మరింత సమాచారం తెలుసుకోండి: