మనిషి తన జీవితంలో ఏది నమ్మినా..నమ్మక పోయినా.. దేవుడు..దెయ్యం విషయాలను మాత్రం ఖచ్చితంగా నమ్ముతారు.  అందుకే వీటీకి సంబంధించిన అనేక కథనాలు..కథలు..సినిమాలు వస్తున్నాయి.  అయితే ఇలాంటివి ఒట్టి రూమర్లు అని హేతువాదులు అంటున్నా..కొంద మంది చదువుకున్న వాళ్లు కూడా దెయ్యాలంటే భయపడిపోతుంటారు.  అయితే భూమిపై దెయ్యాలు ఉన్నాయా..?లేవా? అన్నదానికి ఇప్పటి వరకు ఎవరూ సరైన సమాధానాలు మాత్రం చెప్పలేక పోయారు.  అంతే కాదు దెయ్యాలున్నాయని తెలిస్తే..అటు వైపు వెళ్తే చనిపోతామని భయం ప్రతి ఒక్కరిలో ఇప్పటికీ ఉంది.
Image result for collector amrapali
ఇక దెయ్యాలు ఉన్నాయా? ఈ విషయంలో ఒక్కొక్కరి నమ్మకాలు ఒక్కోలా ఉంటాయి. ఎవరి సంగతి ఎలా ఉన్నా వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి ఇంట్లో మాత్రం దెయ్యం ఉందట.  ఈ విషయం ఆమె స్వయంగా చెప్పడంతో సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  వాస్తవానికి వరంగల్ లో డేరింగ్ అండ్ డాషింగ్ కలెక్టర్ ఎవరంటే వెంటనే చెబుతారు ఆమ్రపాలి అని..కానీ ఆమె ఈ విషయాలు చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.  ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వరంగల్ లోని తన అధికారిక నివాసానికి 133 ఏళ్ల క్రితం శంకుస్థాపన జరగగా, దీనికి నిజాం నవాబు కాలంనాటి జార్జ్ పామర్ అనే ఇంజనీర్ దంపతులు శంకుస్థాపన చేసారని చెప్పారు.
Image result for collector amrapali
అయితే   జార్జ్ పామర్ ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి తనలో కలిగిందన్నారు. దీంతో పరిశోధన చేయగా జార్జ్ పామర్ గొప్ప ఇంజినీర్ అని తెలిసిందన్నారు. అతడి భార్యే ఈ భవనానికి శంకుస్థాపన చేశారన్నారు. గతంలో ఈ భవనంలో పనిచేసిన కలెక్టర్లు ఇందులోని మొదటి అంతస్తులో దెయ్యం ఉందని తనతో చెప్పారని ఆమ్రపాలి పేర్కొన్నారు.

అయినా తాను ధైర్యం చేసి ఆ గదికి వెళ్లగా  గదంతా చిందరవందరగా ఉందని, దీంతో అన్నీ నీట్‌గా సర్దిపెట్టించానని పేర్కొన్నారు.  కానీ అక్కడ మాత్రం తనకు పడుకోవాలంటే చచ్చేంత భయం వేసిందని..అందుకే ఆ గదిలోకి వెళ్లాలనే సాహసం చేయలేక పోయానని నవ్వూతూ అన్నారు. ఏకంగా ఒక కలెక్టరే తన ఇంట్లో దెయ్యం ఉందని చెప్పడంతో ఇప్పుడు వీడియో తెగ ప్రచారం అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: