కుల‌, మ‌తాల ప్ర‌స్తావ‌నే లేని రాజకీయాలు చేస్తానంటూ చెప్పిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్  ఆచ‌ర‌ణ‌లో  విఫ‌ల‌మ‌య్యారా ? అవున‌నే అంటున్నాయి జ‌న‌సేన వ‌ర్గాలు.  ప‌వ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కూ నియ‌మించిన ప‌ద‌వుల్లో అత్య‌ధికం కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారికే ద‌క్కాయ‌నే   ఆరోప‌ణలు  మొద‌లైంది. అంటే ప‌వ‌న్ చెబుతున్న‌దొక‌టి, చేస్తున్న‌దొక‌ట‌న్న‌మాట‌.  ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌న‌సేన‌లో ప‌ద‌వులు అందుకున్న వారిలో 80 శాతం కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారేన‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తోంది.  
అదే స‌మ‌యంలో జిల్లాల‌కు చెందిన నేత‌లెవ‌రైనా ప‌వ‌న్ క‌లిసి ఏదౌనా మాట్లాడాల‌న్నా సాధ్యం కావ‌టం లేద‌ట‌.   ఎందుకంటే, ప‌వన్ చుట్టూ ఓ కోట‌రీ ద‌డి క‌ట్టేసింద‌ట‌. జిల్లాల నుండి వ‌చ్చిన నేత‌లు ఎందుకొచ్చారో తెలుసుకుంటున్న కోట‌రీ స‌భ్యులు వారిని ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళ‌కుండా అడ్డుకుంటున్నార‌ట‌. అందుక‌నే  ప‌వ‌న్ జిల్లాల ప‌ర్య‌ట‌న లో త‌మ‌కు అవ‌కాశం ఎప్పుడిస్తారా అని ఎదురుచూస్తున్నారు.


పిఆర్పీ నేత‌లకే ప‌ద‌వులా ? 

Image result for praja rajyam party

అవును మీరు చ‌దివింది నిజ‌మే. జ‌న‌సేన‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌దవులు పొందిన వారిలో అత్య‌ధికులు ఒక‌పుడు ప్ర‌జా రాజ్యం పార్టీ లో ప‌ద‌వులు అనుభ‌వించిన వారేన‌ట‌. అంటే అప్ప‌ట్లో అన్న‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న వారే ఇపుడు త‌మ్ముడు ద‌గ్గ‌ర‌కు కూడా చేరార‌ట‌.  దాంతో గ‌డ‌చిన ఐదేళ్ళుగా జ‌న‌సేన‌లో ప‌ని చేసిన త‌మను కాద‌ని ఎప్పుడో పిఆర్పీలో ప‌నిచేసిన వాళ్ళ‌ని ఇపుడు త‌మ నెత్తిన రుద్దుతున్నారంటూ  జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ పై మండిపోతున్నార‌ట‌.


నియామ‌కాల‌పై మండిపోతున్న నేత‌లు

Image result for janasena images

జ‌న‌సేన‌ను రాష్ట్రంలో బ‌లోపేతం చేసేందుకు కొన్ని జిల్లాల్లో క‌న్వీన‌ర్లను నియ‌మించాల‌ని ప‌వ‌న్ అనుకున్నారు. అందులో భాగంగానే ఇప్ప‌టికి ఉత్త‌రాంధ్ర‌, ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల‌తో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు క‌న్వీన‌ర్లు, జాయింట్ క‌న్వీన‌ర్ల‌ను నియ‌మించారు.  ఈ విష‌యంలోనే జ‌న‌సేన నేత‌లు మండిపోతున్నారు. పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుండి ప‌నిచేస్తున్న త‌మ‌ను కాద‌ని ఇపుడు ఎవ‌రినో తీసుకొచ్చి క‌న్వీన‌ర్లు, జాయింట్ క‌న్వీన‌ర్ల‌ను  నియ‌మించ‌ట‌మేంట‌ని అసంతృప్తితో ఉన్నారు. పైగా ప‌ద‌వులు కూడా కార్పొరేట్ వ్య‌క్తులు, వ్యాపారుల‌కే ద‌క్కుతోంద‌ట‌.


కార్య‌వ‌ర్గం ఏర్పాటు చేయ‌కుండానే  ?


ఇంకా పార్టీ పూర్తిస్ధాయి కార్య‌వ‌ర్గాన్ని ఏర్పాటు చేయ‌కుండానే జ‌న‌సేన‌పై ఈ స్ధాయిలో ఆరోప‌ణ‌లు మొద‌ల‌వ్వ‌టం ఆశ్చ‌ర్యంగా ఉంది. ప‌వ‌న్ కోట‌రీ చేతిలో ఇరుక్కుపోయార‌నే  ప్ర‌చారం మాత్రం బాగా ఎక్కువ‌గా ఉంది. ఏ పార్టీలో అయినా అధినేత‌లు, అధ్య‌క్షులు త‌మ‌కు న‌మ్మ‌క‌స్తుల‌ను నియ‌మించుకోవ‌టం సహ‌జ‌మే. అంతేకానీ వారి  చేతిలో బందీలైపోయార‌నే ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు వినిపించ‌టం ఎంత మాత్రం మంచిది కాదు. ఒక‌పుడు పిఆర్పి పెట్టిన‌పుడు చిరంజీవి మీద కూడా ఇదే విధ‌మైన ఆరోప‌ణ‌లు వినిపించాయి. మ‌ళ్ళీ త‌మ్ముడు మీద కూడా అవే ఆరోప‌ణ‌లు మొద‌లవ్వటం   గ‌మనార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి: