తెలుగు ఇండస్ట్రీలో మహానటులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) నటసార్వభౌముడిగా ఎంతో కీర్తి ప్రతిష్టలు అందుకున్నారు.  ఆయన నటన అంటే దేశవిదేశాల్లో సైతం అభిమానించే వారు ఉన్నారు.  కేవలం సినీ రంగానికి చెందిన వారే కాదు..రాజకీయ రంగానికి చెందిన వారు కూడా ఎన్టీఆర్ అంటే అభిమానించే వారు.  అలాంటి అభిమానుల్లో అటల్ బిహారీ వాజ్ పేయీ కూడా ఒకరు.  రాజకీయ నేతగా ఎంతో ఉన్నత శిఖరంలో ఉన్న వాజ్ పేయి మహానటులు ఎన్టీఆర్ తో మంచి స్నేహసంబంధాలు కొనసాగించారు. 
Image result for ntr vajpayee
అంతే కాదు ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని పలుమార్లు బయట పెట్టుకున్నారు కూడా.  1984 లో వాజ్ పేయీ రెండు పర్యాయాలు హైదరాబాద్ కు వచ్చారు..అది కేవలం ఎన్టీఆర్ ని కలవడానికే అంటే ఆశ్చర్యపోనవసరం లేదు.  ఇక ఎన్టీఆర్ రాజకీయ సంక్షోభంలో ఉన్నసమయంలో.. నాదెండ్ల భాస్కరరావు గద్దెదించిన తరువాత, తన ప్రభుత్వాన్ని కూల్చివేసినందుకు నిరసనగా ఎన్టీఆర్ నిరసనకు దిగిన వేళ, వాజ్ పేయి వచ్చారు. 
Image result for ntr vajpayee
అంతే కాదు ఎన్టీఆర్ చెప్పటిన నిరసనకు స్వయంగా వాజ్ పేయీ వచ్చి మద్దలు తెలిపారు.  ఆ తర్వాత ఎన్టీఆర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే..ఇక  ప్రమాణ స్వీకారోత్సవానికి సైతం వాజ్ పేయి హాజరై, ఆయన్ను అభినందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: