మార్పు మంచిదే ! అని టీవీ యాడ్ లా వైసీపీ అధినేత జగన్ కూడా పదే పదే మార్పు తీసుకొస్తా మార్పు తీసుకొస్తా అంటూ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నాడు. ఎక్కడికి వెళ్లినా ఆ మాటలే మాట్లాడుతున్నదు. జగన్ తీసుకొస్తాను అని చెప్తున్న మార్పు మంచిదే కానీ ఆ మార్పు ఎలా తీసుకొస్తాడు ఏ విధంగా తీసుకొస్తాడో కూడా చెబితే బాగుండేది. కానీ అవేవి జగన్ చెప్పే స్థితిలో కనిపించడంలేదు. జగన్ చెప్తున్న మాటలు జనాలకు కూడా అసహనం కలిసాగిస్తున్నాయేమో అనే పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయాల గురించి వైసీపీ నాయకులకు కూడా సమాచారం అందుతున్నఅధినేతకు చెప్పే ధైర్యం మాత్రం చేయలేకపోతున్నారు. 


రాజకీయాల్లో విశ్వసనీయత, నిజాయితీ రావాలంటారు. కానీ, తాను వాటిని ఎలా తెస్తానో, ప్రాక్టికల్ గా వాటిని తెచ్చేందుకు తానేం చెయ్యబోతున్నాననేది కూడా జగన్ చెప్పడం లేదు. మార్పు, విశ్వసనీయత, నిజాయితీ, నిబద్ధత. ఇలాంటి పదాలు ఎన్నైనా మాట్లాడొచ్చు. కానీ, వాటిని పాలనలోకి ఎలా తెస్తారనే వివరణ మాత్రం ప్రజలకు కావాలి. జగన్ పాదయాత్ర 239 రోజులు దాటినా వాటిపై ఇంకా స్పష్టత ప్రజలకు ఇవ్వలేకపోతున్నారు. జగన్ కోరుకుంటున్న ఈ 'మార్పు' ఏంటనేది సామాన్యులకు అర్థం కావడం లేదు! ఇంకోటి. ఆ మార్పు జగన్‌ ఒక్కడివల్లే సాధ్యం కాదంటారు, జనం రావాలంటారు! జనానికి అర్థమయ్యేట్టు చెప్పలేని ఆ మార్పు కోసం. జగన్ వెంట జనాలు రావాలంటే ఎలా వస్తారు..? 

Image result for ys jagana

ప్రస్తుతం జగన్ విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నాడు. నర్సీపట్నంలో పాదయాత్ర చేసిన జగన్ ఇలాంటి దోపిడీ పాలన ఇంకా కావాలా అంటూ ప్రజలను ప్రశ్నించారు. మోసం, అవినీతి, అబద్ధాలతో కూడిన చంద్రబాబు పాలనను ఇన్నాళ్లూ చూశారన్నారు. ఇంకో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయనీ, మీకు ఎలాంటి నాయకుడు కావాలో గుండెల మీద చెయ్యేసుకుని ఆలోచించాలని జగన్ కోరారు. ఏ నాయకుడైనా ఫలానా పని చేస్తానని చెప్పి, చెయ్యలేకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి రావాలన్నారు. అలాంటి మార్పు రావాలంటే అది నావల్లే సాధ్యం అని జగన్ చెప్పుకొచ్చారు. 


సరిగ్గా ఇలాంటి మాటలే జగన్ రాజకీయ అజ్ఞానాన్ని తెలియజేస్తున్నాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చలేనివారు, వెంటనే రాజీనామా చేసి ఇంటికెళ్లిపోవాలట! ఒక పార్టీ అధికారంలో ఐదేళ్లు ఉంటుంది కదా! ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఆపార్టీకి చివరిరోజు వరకూ అవకాశం ఉంటుంది. కానీ  హామీలు అమలు చెయ్యలేదని రాజీనామా చేయాలని ఎలా చెప్తారు. అసలు అలా చెయ్యడం ఇప్పుడు చెబుతున్నంత తేలికా ..?  జగన్ కోరుకుంటున్న మార్పును ప్రాక్టికల్ కోణం నుంచి చూస్తుంటే. హామీలు అమలు చెయ్యడానికి ఐదేళ్లు టైమున్నప్పుడు, మధ్యలో రాజీనామా చేసి వెళ్లిపోయే పరిస్థితి ఎలా సాధ్యమౌతుందనేది అర్థం కావడం లేదు. ఇటువంటి విషయాల్లో జగన్ మరికొంత క్లారిటీ తెచ్చుకుని మాట్లాడితే బాగుంటుంది తప్ప ఏదో ఒకటి మాట్లాడేస్తాను అంటే కుదరదు కదా ! 



మరింత సమాచారం తెలుసుకోండి: