జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ దూకుడు కొనసాగిస్తున్నాడు. మొన్నటివరకు పవన్ ప్రభావం ఎన్నికల్లో అంతంత మాత్రమే అని అంచనా వేసిన వారందరి నోర్లు మూతపడేలా తానేంటో తన ఇమేజ్ ఏంటో తెలిసొచ్చేలా పవన్ తన యాత్రలతో చూపించాడు. ఇక అదే ఊపుతో తెలంగాణ గడ్డ ను  కూడా తన రాజకీయ అడ్డాగా మార్హుకునే ప్లాన్ లో భాగంగా అక్కడ కూడా త్వరలో యాత్ర ప్రారంభించేందుకు పవన్ సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే వచ్చే నెలలో హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ పెట్టేందుకు జనసేన సిద్ధం అవుతోంది. ఏపీలో కంటే తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో పవన్ తన స్పీడ్ పెంచినట్టుగా కనిపిస్తోంది. 

Image result for telangana

ఇకపై తెలంగాణ , ఆంధ్రా రెండు ప్రాంతాలను బ్యాలెన్స్ చేసుకుని మరీ రాజకీయాలు నడపాలని పవన్ ప్లాన్ వేసుకుంటున్నాడు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా పోటీ చేసేందుకు వీలుగా పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారు. దీనికి అనుగుణంగానే త్వరలో జనసేన రాష్ట్ర సమన్వయ కమిటీ, గ్రేటర్‌ హైదరాబాద్‌ కమిటీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్ర సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిన వెంటనే దాని బాధ్యులు.. జిల్లా కమిటీల నియామకాన్ని వెనువెంటనే ప్రారంభించి, మొత్తం ప్రక్రియను రెండు, మూడు వారాల్లోనే పూర్తి చేస్తారని చెప్పారు. జనసేనతో కలిసి పనిచేసేందుకు పలు పార్టీలు తెలంగాణలో ఇప్పటికే మద్దతు ప్రకటించాయని, అయితే ఎన్నికల్లో పోటీకి ముందుగా కార్యకర్తలను సమాయత్తం చేసే పనిలో నిమగ్నం అవ్వాలని నేతలకు సూచించారు. 


సెప్టెంబరు రెండో, మూడోవారంలో పార్టీ కార్యకర్తలతో భారీ సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభను హైదరాబాద్‌లోనే నిర్వహిస్తామని, అందుకు సంబంధించిన సన్నాహాలను చేయాల్సిందిగా నేతలకు సూచించారు. ఆ సభలో ఆ పార్టీ తెలంగాణ పొత్తుల విషయంలో క్లారిటీ ఇవ్వబోతుంది. అయితే జనసేన తెలంగాణాలో అధికార పక్షానికి అనుకూలమని, ఆంధ్రప్రదేశ్ కు చెందిన సెట్లర్ల ప్రాభల్యం ఎక్కువగా ఉండే చోట్ల పోటీ చేసి టీఆర్ఎస్ కు  మేలు చెయ్యాలని చూస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. 


హైదరాబాద్ లో సభ పెట్టడం కూడా అదే సూచిస్తుందని వారు అంటున్నారు. అయితే ఈ విషయాలను జనసేన వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. మేము తెలంగాణాలో అన్ని ప్రాంతాల్లో పోటీ చేసి తమ పార్టీ సత్తా చూపిస్తామని వారు అంటున్నారు. అందుకే ముందుగా పార్టీ సభ్యత్వ కార్యక్రమాలపై  ముందుగా దృష్టిపెట్టారు. వీలైనంత ఎక్కువమందికి తెలంగాణాలో పార్టీ సభ్యత్వం ఇచ్చేలా దృష్టిపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా అస‌లే మాత్రం పార్టీకి ప‌ట్టులేని తెలంగాణ‌లో ప‌వ‌న్ ప్లాన్ ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: