ఏపీలో ఎన్నికల హడావిడి మాములుగా లేదు..రాజకీయ నేతలు మొదలు పార్టీల అధినేతలు సైతం గుండెలు చేత్తో పట్టుకుని ఊపిరి బిగపట్టుకుని జరిగేది ఏంటో తెలియక..ఏమి జరుగుతుందో అర్థం కాక..భవిష్యత్తుపై బెంగతో సమయం కోసం వేచి చూస్తున్నారు..అయితే సీనియర్ పార్టీలుగా పేరొందిన తెలుగుదేశం ,వైసీపీలు మాత్రం తమ తమ పార్టీలలో జంపింగ్ లు ఎవరు ఉన్నారో లెక్కలు వేసుకుంటూ పార్టీని కాపాడుకునే పనిలో ఉండగా ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఇరు పార్టీలకి సవాలు విసురుతూ దూసుకుపోతున్న జనసేన మాత్రం జరుగుతున్న పరిణామాలని నిశితంగా గమనిస్తూ ఉంది..

 Related image

టీడీపీలో సీనియర్ నేతలు ఎక్కడ చేజారిపోతారో అనే భయం చంద్రబాబు ని ఒక పక్క వెంటాడుతూనే ఉంది.. విశ్లేషకుల అంచనా మేరకు జనసేన పార్టీలోకి వలసలు ఎక్కువగా టీడీపీ నుంచీ ఉంటాయని చెప్పడంతో బాబు ఒక కంట తమ పార్టీ నేతలని కనిపెట్టుకుంటూనే ఉన్నారు..ఇప్పటికే చాలా మంది టీడీపీ నేతలు వైసీపీలోకి జంప్ అవ్వగా మరికొందరు జగన్ తో టచ్ లో ఉన్నారని తెలియడంతో బాబు తెగ టెన్షన్ పడుతున్నారు అయితే...తాజాగా అందరికీ షాక్ ఇస్తూ ఉభయగోదావరి జిల్లా నాయకులు పెద్ద ఎత్తున పార్టీలోకి వెళ్ళడంతో అందులోనూ ఈ రెండు జిల్లాలో అత్యధిక వర్గంగా పేరున్న శెట్టిబలిజ నేతలు జనసేనలోకి వెళ్ళడం టీడీపీ వైసీపీలని కలవర పెడుతోంది..ఈ క్రమంలోనే ఇటీవలే డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజీ, వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ కందుల లక్ష్మీ దుర్గేష్ జనసేనలోకి వెళ్ళడంతో జనసేన పార్టీ జోరందుకుంది..ఇదిలాఉంటే ఎవరూ ఊచించని తీరిలో పితాని బాలకృష్ణ జనసేనకి జై కొట్టడంతో అందరిని షాక్ కి గురిచేసింది..

 Related image

పితాని గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ గా పితాని బాలకృష్ణ పనిచేస్తున్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ లో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ వైసీపీలోకి జంప్ ఆవ్వడంతో  తీర్థం పుచ్చుకున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గ అభ్యర్థిగా పొన్నాడ వెంకట సతీష్  కుమార్ పోటీ చేస్తారని జగన్ స్పష్టం చేశారని తెలిసింది..దాంతో కలత చెందినా బాలకృష్ణ పార్టీ కి దూరం అయ్యారు..దాంతో తన సత్తా ఏమిటో చూపించుకున్న బాలకృష్ణ ఏ పార్టీలోకి వెళ్ళకుండానే వ్యక్తిగతంగా ప్రజలలో తిరుగుతూ ఉన్నారు..అయితే

 Pitani joins in Jana sena in the presence of Pawan Kalyan

ఈ నేపథ్యంలో జనసేన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్న పితాని అందులో  భాగంగా పవన్ కళ్యాణ్ ను కలిసి తన అభిప్రాయాలను తెలిపి జనసేనలో చేరడానికి సర్వం సిద్దం చేసుకున్నారు..దాంతో పితాని బాలకృష్ణ రాకను పవన్ కళ్యాణ్ స్వాగతించారు కూడా..అయితే ముమ్మిడివరం నియోజకవర్గం బీసీలకి కంచుకోట ఇక్కడ గెలుపు ఓటములు శెట్టి బలిజ , మత్స్యకార వర్గాలు నిర్ణయిస్తాయి దాంతో ఇప్పుడు ఇక్కడ గెలుపుపై సర్వాత్ర ఉత్ఖంట నెలకొంది..అయితే జనసేన నుంచీ పితాని ,వైసీపీ నుంచీ పొన్నాడ ఫిక్స్ అవ్వగా..తెలుగుదేశం పార్టీ నుంచీ బాబు చివరిలో ఎవరిని రంగంలోకి దింపుతారో వేచి చూడాలి మొత్తానికి జనసేన లోకి పితాని ఎంట్రీ ముమ్మిడివరంలో పొలిటికల్ హీట్ ని పెంచేసింది అంటున్నారు.  

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: