కుండపోత వర్షాలతో వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలమయింది. భారీవర్షాలతో లొంగిపోయిన నదులు కేరళ రాష్ట్రం యొక్క అందాలను కకావికలం చేశాయి. దైవ భూమిగా పిలిచే  రాష్ట్రం ప్రకృతి పగబట్టినట్లు అయ్యింది. వాగులు వరదలు పొంగిపోవడం తో చాలామంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పునరావాస కేంద్రంలో ఉంటున్నా వారు క్రమక్రమంగా ఇంటికి చేరుకుని శుభ్రం చేసుకునే కార్యక్రమంలో మునిగితేలుతున్నారు.

Image result for kerala flood

కట్టుబట్టలతో తిండీ తిప్పలు లేక చాలామంది ఈ తుఫాను దెబ్బకు భీతి చెందారు. దీంతో కేరళ రాష్ట్రం భయంకరమైన ప్రకృతి విపత్తుల్లో ఉండటంతో దేశం మొత్తం కేరళ రాష్ట్రానికి అండగా నిలబడింది. ఇదే క్రమంలో ప్రపంచంలో...దేశంలో ఉన్న చాలామంది ప్రముఖులు కూడా కేరళ రాష్ట్రానికి భారీగా విరాళాలు ప్రకటించారు. ఈ తుఫాను దెబ్బకు వేలాది మంది నిరాశ్ర‌యుల‌య్యారు. క‌ట్టుబ‌ట్ట‌ల‌తో మిగిలిపోయారు.

Related image

దీంతో కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలనే డిమాండ్ ఊపందుకుంది. అన్ని రాష్ట్రాల సీఎంలు ఇదే డిమాండ్ ను కేంద్రం ముందు ఉంచగా ఎట్ట‌కేల‌కు కేంద్ర హోం మంత్రిత్వ‌శాఖ కేర‌ళ వ‌ర‌ద‌ల‌ను తీవ్ర‌మైన విప‌త్తుగా ప్ర‌క‌టించింది. దీని వ‌ల్ల కేర‌ళ‌కు జాతీయ విప‌త్తు నిధి నుంచి సాయం అందుతుంది. ఆగ‌స్టు 18న కేంద్ర బృందం కేర‌ళ రాష్ట్రంలో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించింది. న‌ష్టాన్ని అంచ‌నా వేసిన హోం శాఖ కేర‌ళ వ‌ర‌ద‌ల‌ను తీవ్ర‌మైన విప‌త్తుగా ప్ర‌క‌టించింది.

Related image

కేరళ వరదలలో ఇప్ప‌టివ‌ర‌కూ ఏడు లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్రం దీనిని తీవ్రమైన పకృతి విపత్తుగా గుర్తిస్తున్నట్లు హోం శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేయడంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో సంతోషించింది. ప్రస్తుతం వచ్చిన తుఫాను దెబ్బకు కేరళ రాష్ట్రంలో అధికారికంగా 20వేల కోట్ల ఆస్తి మేరకు నష్టం వాటిల్లిందని సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: