తెలంగాణ యువతి దిపికా జొన్నల గడ్డ అరుధైన ఘనత సాధించింది. అయితే తెలంగాణకు చెందిన యువతులు ఇలాంటి పోటీల్లో పాల్గొనడం చాలా అరుదుగా కనిపిస్తుంది..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు రావడంతో ఇక్కడి అమ్మాయిలు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. 

తెలంగాణకు చెందిన దీపికా జొన్నలగడ్డ.. సౌతాఫ్రికా అందాల పోటీల్లో పాల్గొన్నది. గ్లో టీవీ నిర్వహించిన మిస్ ఇండియా సౌతాఫ్రికా పోటీల్లో ఆమె రెండవ విజేతగా నిలిచింది. ఈ పోటీలో 1200 మంది ఈ అందాల పోటీల్లో పాల్గొన్నారు. సౌతాఫ్రికాలో జరిగిన బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొన్న ఏకైన తెలంగాణ అమ్మాయి కూడా ఈమే.

హైదరాబాద్‌లోని నాగోల్‌కు చెందిన దీపిక.. లండన్‌లోనూ ఉన్నత విద్యను అభ్యసించింది. అయితే ఈ పోటీలో విడాకులు తీసుకున్న భారతీయ మహిళలు మాత్రం ఈ అందాల పోటీలో పాల్గొంటారు. 

కాగా, చిన్నతనం నుంచే దీపిక ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఇలాంటి అందాల పోటీ ద్వారా మహిళలు తమ సాధికారతను చాటుకునే అవకాశం ఉంటుందని దీపిక జొన్నలగడ్డ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: