ప్ర‌స్తుతం బ‌యోపిక్ ల‌కు కాలం అనుకూలంగా ఉన్న‌ట్లుంది చూడ‌బోతే.  చంద్రోద‌యం బ‌యోపిక్ మొద‌టి టీజ‌ర్ విడుద‌ల‌తో బయోపిక్ ల‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి పెరిగిపోతోంది.  అందులోనూ ఈమ‌ధ్య‌నే విడుద‌లైన మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్ ఘ‌న‌విజయం సాధించ‌టంతో జ‌నాల్లో బ‌యోపిక్ ల‌పై బాగా ఇంట్రెస్టు పెరిగిపోయింది. దానికితోడు ఇప్ప‌టికే దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్,  తెలుగుదేశంపార్టీ వ్య‌వ‌స్దాకుడు, మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీయార్ బ‌యోపిక్ లు రెడీ అవుతున్నాయి.  వైఎస్సార్ బ‌యోపిక్ అయినా, ఎన్టీయార్ బ‌యోపిక్ అయినా వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని త‌యార‌వుతున్న‌వే.  


వైఎస్సార్ బ‌యోపిక్


స‌రే, వైఎస్సార్, ఎన్టీఆర్ బ‌యోపిక్ లంటే వాళ్ళ జీవితాల్లో చోటు చేసుకున్న ముఖ్య ఘ‌ట్టాల‌కు దృశ్య రూప‌మివ్వ‌ట‌మే ప్ర‌ధానం. బ‌యోపిక్ లంటే స‌హ‌జంగానే పాజిటివ్ అంశాల‌నే ఎక్కువ‌గా హైలైట్ చేస్తార‌న‌టంలో సందేహంలేదు. కాబ‌ట్టి, వైఎస్సార్ అయినా ఎన్టీయార్ బ‌యోపిక్ అయినా అంతే.  వైఎస్సార్  బ‌యోపిక్ విష‌యంలో పెద్ద‌గా కాంట్ర‌వ‌ర్సీలు లేవు.   కాక‌పోతే వైఎస్సార్ మృతి విష‌యంలో  అనేక వివాదాలున్నాయి. 


ఎన్టీయార్ బ‌యోపిక్


కానీ, ఎన్టీఆర్ విష‌యం అలాకాదు. సినీ జీవితంలో ఎటువంటి వివాదం లేదు.  1982లో తెలుగుదేశంపార్టీ పెట్టిన‌ప్ప‌టి నుండి అంతా చ‌రిత్ర‌,  సంచ‌ల‌నాలు, వివాదాస్ప‌దాలే. టిడిపి పెట్ట‌ట‌మే ఓ సంచ‌ల‌నం. పార్టీ పెట్టిన తొమ్మిది నెల‌ల్లోనే అధికారంలో రావ‌టం మరో చ‌రిత్ర‌. అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిలోనే వెన్నుపోటుకు గురై ప‌ద‌విని కోల్పోవ‌టం పెద్ద సంచ‌ల‌నం. 1985 మ‌ళ్ళీ అధికారంలోకి రావ‌టం, 1989లో ఓడిపోవ‌టం,  ల‌క్ష్మీపార్వ‌తిని వివాహం చేసుకోవ‌టం, తిరిగి 1994లో మూడోసారి ముఖ్య‌మంత్ర‌వ్వ‌టం పెద్ద సంచ‌ల‌నం.  


మిస్ట‌రీగా మిగిలిపోయిన ఎన్టీయార్ మ‌ర‌ణం

Image result for ntr death mystery

ఇవ‌న్నీ ఒక ఎత్తైతే మూడోసారి సిఎం అయిన ఎనిమిది నెలల్లోనే రెండోసారి వెన్నుపోటుకు గురై ముఖ్య‌మంత్రి ప‌ద‌విని కోల్పోవ‌టం పెద్ద షాక్. షాక్ ఎందుకంటే, రెండోసారి కుటుంస‌భ్యుల అండ‌తో స్వ‌యంగా అల్లుడు చంద్ర‌బాబునాయుడే వెన్నుపోటు పొడిచి సిఎం ప‌ద‌విని లాక్కోవ‌టం పెద్ద‌ షాక్ కాక మ‌రేంటి ? త‌ర్వాత 1996లో ఎన్టీఆర్ మ‌ర‌ణం కూడా పెద్ద మిస్ట‌రీగానే మిగిలిపోయింది.


చంద్ర‌బాబు బ‌యోపిక్


స‌రే, ప్ర‌స్తుతానికి వ‌స్తే చంద్ర‌బాబు జీవితం ఆధారంగా కూడ ఓ బయోపిక్ త‌యార‌వుతోంది.  బ‌యోపిక్ అంటే వివిధ కార‌ణాల వ‌ల్ల అన్నీ నిజాలే చెప్ప‌లేక‌పోయినా అబ‌ద్దాలు మాత్రం ఉండే అవ‌కాశాలు లేవు. మొన్న‌టి సావిత్రి బ‌యోపిక్ తో జ‌నాలంద‌రికీ అర్ధ‌మైందదే.  చంద్ర‌బాబు బ‌యోపిక్ అంటేనే టిడిపి అభిమానులో లేక‌పోతే చంద్ర‌బాబు భ‌జ‌నప‌రులో రూపొందిస్తున్నార‌న్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అటువంటిది చంద్ర‌బాబు బ‌యోపిక్ లో ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఏమి చూపిస్తారు  ?


ఏ బ‌యోపిక్ ను ఆధ‌రిస్తారో ?


అస‌లు చంద్ర‌బాబు జీవితంలో చూప‌టానికి ఏముందో అర్ధం కావ‌టం లేదు. బ‌యోపిక్ అంటే ఏదో ఒక రంగంలో గొప్ప‌వాళ్ళు అయిఉంటార‌ని అంద‌రూ అనుకుంటారు. ఎన్టీఆర్ వ‌ర‌కూ సినీ, రాజకీయ జీవితాలు ఒక చ‌రిత్ర‌గానే చెప్పుకోవాలి. వైఎస్సార్ జీవితంలో కూడా పాద‌యాత్ర ఎంత చ‌రిత్ర సృష్టించిందో మ‌ర‌ణం  పెద్ద మిస్ట‌రీగా మిగిలిపోయింది.  మ‌రి చంద్ర‌బాబు జీవితంలో అటువంటి చ‌రిత్ర‌లు ఏమున్నాయ్ ?  చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితం మొత్తం నెగిటివ్ రికార్డే ఉంది. ప్ర‌ధానంగా ఎన్టీఆర్ నుండి సిఎం కుర్చీని లాక్కోవ‌టం.  ఎలాగూ ఎన్నిక‌ల ముందు రిలీజ్ చేసే ఉద్దేశ్యంతోనే బ‌యోపిక్ తీస్తుంటారు కాబ‌ట్టి ఒకేసారి మూడు బ‌యోపిక్ ల్లో దేని జ‌నాలు ఆధ‌రిస్తారో చూడాల్సిందే. మ‌రి, చంద్ర‌బాబు పై తయార‌వుతున్న చంద్రోద‌యంలో ఎన్ని నిజాలుంటాయో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: