నందమూరి హరికృష్ణ మరణించడంతో తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకురావాలని చాలామంది టిడిపి సీనియర్ రాజకీయ నేతలు చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే పార్టీని కాపాడలేకపోయారు...అయితే ప్రస్తుతం ఆంధ్రాలో పరిస్థితులు బట్టి చూస్తే టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ రావడం వల్ల మేలు జరుగుతుందని అధినేత చంద్రబాబు గారికి సీనియర్ నాయకులు తెలియజేశారట.

Related image

చంద్రబాబు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ రావడం వల్ల తన కుమారుడు నారా లోకేష్ కి చాలా డామేజ్ అవుతుందని భావిస్తున్నారట. ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీలో ఉండే బాలకృష్ణ మద్దతు దారులు కూడా జూనియర్ రాకని విభేదిస్తున్నారు అని సమాచారం. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూస్తే చాలా అధ్వాన్నంగా ఉందని ఇటీవల నిర్వహించిన సర్వేలో వచ్చిన ఫలితాల ద్వారా బయటపడింది.

Related image

ఈ క్రమంలో ఈ విషయాన్ని ముందే గ్రహించిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా కంటే పొత్తుల ద్వారానే 2019 ఎన్నికల బరిలోకి దిగాలని..ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా వస్తున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇటీవల కూడా రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తారని వార్తలు కూడా వచ్చాయి.

Image result for jr ntr chandrababu

అయితే ఇటువంటి పరిస్థితుల్లో సీనియర్ రాజకీయ నాయకులు చంద్రబాబుతో వచ్చే ఎన్నికలలో  రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపే కంటే వచ్చే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకువచ్చి ప్రజల్లోకి వెళ్లడం మంచిదని పేర్కొంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: