ఎంతో గ్రాండ్ గా జరిగిన ప్రగతి నివేదిక సభ చివరికి కేసీఆర్ కు ఆ పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చింది. రాజకీయ పార్టీలు నిర్వహించే చాలా కార్యక్రమాల్లో 'మందు' చాలా చాలా కామన్‌. మందు, ముక్క బిర్యానీతో కలిపి లేకుండా పని జరగదనే స్థాయికి రాజకీయాలు దిగజారిపోయాయి. అయితే, ప్రగతి నివేదన సభ కోసం వచ్చిన 'గులాబీ అభిమానులు' మద్యంతో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. బస్సుల్లోనూ, కార్లలోనూ, సభా ప్రాంగణంలోనూ, ఇతర చోట్లా.. ఎక్కడికక్కడ మద్యం మత్తులో జోగారు.

Image result for trs sabha

ఆకాశంలో సగం.. అన్నింటా సగం.. అనుకున్నారో ఏమో.. మహిళలూ, మద్యం మత్తులో ఊగిపోయారు. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా 'ప్రగతి నివేదన సభ' అంచనాల్ని అందుకోలేకపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగం కావొచ్చు, ఆ ప్రసంగంలో ముందస్తు ఎన్నికలపై ఆయన క్లారిటీ ఇవ్వకపోవడం కావొచ్చు.. ఇవన్నీ టీఆర్‌ఎస్‌ శ్రేణుల్ని తీవ్రంగా నిరాశపర్చేశాయి. కేసీఆర్‌ ఏదన్నా వేదికపై మాట్లాడితే, ఆ మాటల్లో పవర్‌ వుంటుంది.

Image result for ktr

కేసీఆర్‌ ఎన్ని గంటలపాటు ప్రసంగించినా.. ఇంకా ఇంకా మాట్లాడితే బావుంటుందన్పిస్తుంది. ఆయన అలా మాటలతో మెస్మరైజ్‌ చేసేస్తారు. ఆ మ్యాజిక్‌ ప్రగతి నివేదన సభలో కన్పించలేదు. కేసీఆర్‌ ఇలా ప్రగతి నివేదన సభలో నిరుత్సాహపర్చడం.. మరోపక్క, 'మద్యం' రగడ.. వెరసి ఈ మొత్తం ఎపిసోడ్‌లో 'గులాబీ' పార్టీ పరువు పోయింది.  అన్నట్టు, ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను అత్యంత జాగ్రత్తగా చూసుకున్న మంత్రి కేటీఆర్‌ సోషల్‌ మీడియాలో తనకు వచ్చి పడ్తోన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ప్రగతి నివేదన సభ కాదు ఇది.. మందు నైవేద్యం సభ.. అంటూ సెటైర్లు వేస్తున్నారు. నాన్ని రప్పించడమంటే, ఇలా మందుపోసి వారిని మత్తులో జోగేలా చేసి రప్పించడమా.? అని ప్రశ్నిస్తున్నారు జనం. ఆ ప్రశ్నలకు కేటీఆర్‌ మాత్రం ఎలా సమాధానం చెప్పగలరు.? 

మరింత సమాచారం తెలుసుకోండి: