ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవిలోకి వచ్చిన తర్వాత తమ నాయకుల స్వలాభాలు..తన స్వలాభాలపై ఉన్న దృష్టి ప్రజలపై లేదని..ముఖ్యంగా గిరిజనులను పూర్తిగా విస్మరించారని..వారు అనారోగ్యంతో మరణిస్తున్నా కూడా చోద్యం చూస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా.   రాష్ట్రంలో గిరిజనులు కనీస వైద్య సౌకర్యాలు లేక అల్లాడిపోతున్నారని అన్నారు. ప్రభుత్వానికి గిరిజనుల ఓట్లపై ఉన్న శ్రద్ధ వాళ్ల ప్రాణాలపై లేదన్నారు.

గిజనలు కోసం బడుగు బలహీన వర్గాల కోసమే అని చెప్పే ఈ ప్రభుత్వ ఈ గోడును పట్టించుకోవటం ఆగ్రహం వ్యక్తం చేశారు.  చంద్రబాబు నాయుడు అభివృద్ది పేరిట కోట్లు ఖర్చు పెట్టి విదేశాలు తిరుగుతూ పేదవారికి కనీస ఆరోగ్యం వసతులు కల్పించటం లేదని వారి ప్రాణాలుతో చెలగాటమాడుతున్నారని అన్నారు.  విజయనగరం జిల్లాలోని ఓ ఆసుపత్రిలో కనీస సదుపాయాలు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని రోజా ట్వీట్టర్ లో ప్రస్తావించారు.
Image result for chandrababu naidu
విజయనగరంలోని కొత్తవలస గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడుగురు మహిళలకు ఒకే స్టాండ్ సాయంతో సెలైన్లు ఎక్కిస్తున్న, ఒకే బెడ్ పై ఐదుగురు రోగులను కూర్చోబెట్టిన ఫొటోలను ఈ రోజు రోజా ట్వీట్ చేశారు. ‘ఏపీని మెడికల్ హబ్ చేస్తానన్న నారా చంద్రబాబునాయుడు గారూ.. ఇదీ తమరు చేసింది. విజయనగరం జిల్లాలో కొత్తవలస గ్రామ ప్రభుత్వ ఆసుపత్రిలో తీసింది ఈ చిత్రం. ఈ ప్రభుత్వానికి గిరిపుత్రుల ప్రాణాలు అక్కర్లేదు కానీ వాళ్ల ఓట్లు కావాలా?’ అని రోజా ట్విట్టర్ లో ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: