అధికారంలోకి రావడమే పరమావధిగా ఉండే మన దేశ రాజకీయ నాయకుల వైఖరి ఎన్నికలకు ముందు తమ పార్టీని గెలిపించడం కోసం ఊకదంపుడు ఉపన్యాసాలతో నోటికి తోచిన వాగ్దానాలు చేస్తారు.  ఒక్కసారి తమ పార్టీ గెలుపు గుర్రం ఏక్కితే చాలు, అంతే సామాన్య ప్రజలు వారికి చీమల్లా కనిపిస్తారు వారి సాధక బాదకాలు అస్సలు పట్టించుకోరు. 2014 ఎన్నికలకు ముందు మహిళల ఋణాలన్నీ రద్ధు చేస్తానని ముఖ్యంగా డ్వాక్రా మహిళల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని వాగ్దానం చేశారు, భారత్ లోనే నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ రాజకీయ పాలన అనుభవమున్న ఏఇ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఆ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా. 
chandrababu & his election promises కోసం చిత్ర ఫలితం
ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి హోదా, ఋణ మాఫీ, రాజధానిగా అత్యాధునిక విశ్వనగరం అమరావతి, పోలవరం ప్రోజెక్ట్, నదుల అనుసంధానం, నిరుద్యోగ నిర్మూలన, పారిశ్రామికీ కరణం, ఐటి & ఐటిఈఎస్ ప్రోజెక్ట్స్ - ఇలా 600వాగ్ధానాలు చేసి "వాగ్ధాన కర్ణుడు" అనిపించుకున్నారు ఏపి ముఖ్యమంత్రి. ఆ వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ముఖ్య మంత్రి, అందులో 10శాతం  అంటే 60 వాగ్ధానాలు కూడా నేరవేర్చకుండా నాలుగున్నరేళ్ళు కాలం గడిపేశారు.



2014-15 ఆర్ధిక సంవత్సరానికే కాదు - గడిచిన నాలుగుసంవత్సరాలలో ఇప్పటి వరకూ ఒక్కఆర్ధిక సంవత్సరానికి కూడా డ్వాక్రా రుణమాఫీ చేయలేదని “మహిళా సాధికారత - శిశు సంక్షేమ-  దివ్యాంగులు - వయోవృద్దుల సంక్షేమ శాఖ మంత్రిణి” పరిటాల సునీత స్వయంగా ప్రకటించారు.  ఆంధ్రప్రదేశ్ లో వర్షాకాల శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వైసిపి సభ్యులు డ్వాక్రా రుణాల మాఫీపై లేఖ ద్వారా ప్రశ్నించారు. దీనికి మంత్రి లిఖిత పూర్వకం గా సమాధానం చెప్పారు.
chandrababu & his election promises కోసం చిత్ర ఫలితం
ఎన్నికలలో గెలవడానికి మహిళల ఓట్లేకీలకం అన్నవిషయం విషయం చంద్రబాబు నాయుడికి తెలియంది కాదు. దీంతో 2014లో మహిళలకు వరాలజల్లు కురిపించారు. అందులో భాగమే డ్వాక్రా రుణాల మాఫీ.  దాన్ని ముఖ్యంగా రద్ధు చేసేస్తానని వాగ్ధానంతో మహిళల ఓట్లేయించుకొని - అధికారంలోకి వచ్చి ఆపై ఏ ఒక్క వాగ్ధానం కూడా నెరవేర్చక  పోవడం “ఏరు దాటాక తెప్ప తగలేసే చంద్రబాబు నైజం” బయట పెట్టుకున్నారు. ఇప్పుడు డ్వాక్రా మహిళల రుణాల మాఫీ విషయంలోను ఆయన ఇదే పద్దతి పాటించారు. 

paritala sunitha కోసం చిత్ర ఫలితం

ఎన్నికలకు ముందు అన్ని వర్గాలను ఆకట్టుకుని వారి వారి తక్షణ అవసరాలను తీరుస్తామని చెప్పి అధికారాన్ని పొందడం చంద్రబాబు ప్రతి ఎన్నికల్లోనూ చేసే పని. డ్వాక్రా మహిళల విషయంలోనూ ఆయన ఇలాంటి మోసానికే పాల్పడ్డారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయలేదంటూ మంత్రి పరిటాల సునీత ప్రకటించడం తో చంద్రబాబు మోసాల కథ వెలుగు లోకి వచ్చిందని మహిళా సంఘాలు మండిపడు తున్నాయి.
chandrababu & his election promises కోసం చిత్ర ఫలితం
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అయిన ఒక్క రూక  రుణం కూడా తీర్చక పోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రతీ ఏడాది వేల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేయక పోవడంతో డ్వాక్రా మహిళలు ఆందోళన చేస్తున్నారు. రైతుల ను మోసం చేస్తున్నట్టుగానే తమచేత ఓట్లు వేయించు కుని మోసం చేశారని వారంటున్నారు. వచ్చే ఎన్నికలలో తమను ఓట్లు ఎలా అడుగుతారని మహిళ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రుణాల ను మాఫీ చేయకపోగా-మాఫీ చేసే పరిస్థితి లేదంటూ ప్రభుత్వం స్పష్టం చేయడాన్ని అన్నీ వర్గా లు తప్పుపడుతున్నాయి. ఇది ప్రజా వ్యతిరేక చర్యని మహిళ సంఘాలు మండి పడుతున్నాయి.
paritala sunita reply to dwakra women loans కోసం చిత్ర ఫలితం
డ్వాక్రా రుణమాఫీ చేశారా? అలాంటి ప్రతిపాదన ఏమైనా ఉందా? చెప్పాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు రోజా, పుష్పశ్రీవాణి, గౌరు చరిత లు లిఖితపూర్వకంగా పంపిన ప్రశ్నకు మంత్రి సునీత అసెంబ్లీలో సమాధానం చెప్పారు. 2014 నుంచి ఇప్పటి వరకు డ్వాక్రా రుణమాఫి అంటూ ఏమీ చేయలేదని మంత్రి సమాధానం ఇచ్చారు. అలాంటి ప్రతిపాదన కూడా ఏమీ ప్రభుత్వం వద్ద లేదన్నారు. ₹11069 కోట్ల ఋణాల్లో ఎలాంటి మాఫీ జరగలేదన్నారు. వడ్డీ కింద మాత్రం 13వందల 38కోట్లు చెల్లించా మని సునీత రాతపూర్వకంగా చెప్పారు.


బాబు పాలన అంతా అప్పులు అవినీతిమయం, కాని ఆయనకు వాచీ ఉంగరా లు కూడా లేవు ఆయన నిప్పు   


చంద్రన్న పసుపుకుంకుమ పథకం కింద డ్వాక్రా మహిళలను అదుకుంటున్నామని వివరించారు. రుణమాఫీ కంటే పసుపు కుంకుమ పథకం వల్లే ఎక్కువ లబ్ధి డ్వాక్రా మహిళలకు జరుగుతుందని మంత్రి సమాధానం చెప్పారు. మంత్రి తన సమాధానంలో ఇప్పటి వరకు డ్వాక్రా రుణమాఫీ చేయలేదని, అలాంటి ప్రతిపాదన కూడా ఏమీ లేదని, 11 వేల 069 కోట్ల రుణాలు అలాగే ఉన్నాయని స్పష్టంగా చెప్పడం విశేషం.

chandrababu & his election promises కోసం చిత్ర ఫలితం

ఇక్కడ చంద్రబాబు నాయుడు 100 శాతం పోలిటీషియన్ 

ప్రశ్నించే ప్రతిపక్షపార్టీని రాజకీయ పతనం చేసి, ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాన్ లాంటి స్నేహితుని మైత్రిని పాతరేసి, పోత్తు పెట్టుకున్న బాజపాపై తన వాగ్ధాన నేఱాలన్నీ నేట్టేసి తాను బుద్ధిమంతుణ్ణ్నని, నిప్పునని చెప్పుకొంటూ తనకుటుంబలోని తనకుమారునికి మంత్రిపదవిచ్చి నిరుద్యోగ నిర్మూలన అనే వాగ్ధానాన్ని పూర్తి చేశారు. తనకోడలు బ్రహ్మిణికి ప్రాముఖ్యత ఇస్తూ మహిళా సాధికారత పూర్తిచేశారు. తన శ్రీమతి భువనేశ్వరికి వ్యాపారాభివృద్ధికి అన్నీ ఆటంకాలు తొలగించి హెరిటేజ్ వృద్ధికి సహకరించి మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించారు. 

paritala sunita reply to dwakra women loans కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: