వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న గెలుపుపై తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ కు  అనుమానం ఉందా ?  అందుక‌నే అవ‌కాశం ఉన్నంత‌లో ఇపుడే మొత్తం ఊడ్చేస్తున్నారా ? క్షేత్ర‌స్ధాయిలో జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే అవుననే స‌మాధానం వినిపిస్తోంది. తాజాగా  ఓ చెరువు పేరుతో రైతుల నుండి 60 ఎక‌రాలు సేక‌రించి మ‌ట్టిని దోచేసుకుంటున్నారు. కేవ‌లం మ‌ట్టి అమ్మ‌కాల ద్వారానే ఏడిదిలో  కోట్లు సంపాదించార‌ని ఆరోప‌ణ‌లు.


రూ 50  కోట్ల మ‌ట్టి త‌వ్వేస్తున్నారు

Image result for chintamaneni controversy

ఇంత‌కీ విష‌యం ఏమిటంటే, చింత‌ల‌పూడి ఎత్తిపోత‌ల ప‌థ‌కం ప‌క్క‌నే ఓ చెరువు  త‌వ్వ‌కానికి 100 ఎక‌రాలు కావాల్సొస్తే రైతుల నుండి ఎంఎల్ఏ బ‌ల‌వంతంగా 60 ఎక‌రాలు కొన్నారు. అందుక‌నే ఎక‌రాకి రూ. ల‌క్ష చొప్పున అడ్వాన్సుగా చెల్లించి అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఎలాగూ అగ్రిమెంట్ చేయించుకున్నారు కాబ‌ట్టి, తీసుకున్న భూమి చెరువు త‌వ్వ‌కానికే కాబట్టి ఎంఎల్ఏ 60 ఎక‌రాల్లో మ‌ట్టి త‌వ్వేసుకున్నారు. అడ్వాన్స్ చెల్లింపుల‌ త‌ర్వాత  రైతుల‌కు మ‌ళ్ళీ ఎంఎల్ఏ  ఒక్క రూపాయి కూడా చెల్లించ‌క‌పోయినా రూ. 50  కోట్ల విలువైన మ‌ట్టిని మాత్రం త‌వ్వేసుకున్నారు.   


అందిన‌కాడికి ఊడ్చేస్తున్నారు

Image result for chintamaneni controversy

ఎంఎల్ఏ ధౌర్జ‌న్యాన్ని త‌ట్టుకోలేని రైతులు వైసిపి నేత‌ల‌తో మొత్తుకున్నారు. దాంతో నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జి కొఠారి అబ్బ‌య్య చౌద‌రి ఆధ్వ‌ర్యంలో రైతులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న తెలిపారు. దాంతో పోలీసులు అబ్బ‌య్య చౌద‌రితో పాటు పార్టీ నేత‌ల‌పై కేసులు పెట్టారు. చింత‌మ‌నేని వ‌ర‌స చూస్తుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపుపై అనుమానంతో ఉన్న‌ట్లున్నారు. అందుకే అందిన‌కాడికి అంతా ఊడ్చేస్తున్నారు. 


వ్య‌వ‌హార శైలంతా వివాదాస్ప‌ద‌మే

Image result for chintamaneni controversy

ఎందుకంటే, గ‌డ‌చిన నాలుగేళ్ళ‌ల్లో నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్క‌డ చూసినా గొడ‌వ‌లే. నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కు ఎదురుతిరిగి జ‌నాల‌ను కొట్ట‌టం, అక్ర‌మ వ్యాపారాలు, ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై పోలీసుల మీద‌ ఒత్తిడి తెచ్చి కేసులు పెట్టించ‌టం, అధికారుల‌ను బ‌హిరంగంగానే బూతులు తిట్ట‌టం లాంటివి ఎక్కువైపోతున్నాయి. అదే స‌మ‌యంలో వైసిపిపై జ‌నాల్లో ఆధ‌ర‌ణ పెరుగుతున్నా ఎంఎల్ఏ ఏమాత్రం ఖాత‌రు చేయ‌టం లేదు.


జ‌నాలు ఓట్లేస్తారా ?

Image result for chintamaneni controversy

ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటే ఏ పార్టీకి చెందిన ఎంఎల్ఏ అయినా  త‌న దూకుడు త‌గ్గిస్తారు. జ‌నాల దృష్టిలో మంచివాడ‌నని అనిపించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తారు. స‌రే ఏది చేసిన ఓట్ల కోస‌మే అనుకోండి అది వేరే సంగ‌తి. కానీ ఇక్క‌డ టిడిపి ఎంఎల్ఏ చింత‌మ‌నేని య‌వ్వారం మాత్రం విచిత్రంగా ఉంది.  ఈయ‌న‌పై ఎన్నో పోలీసు కేసులున్నాయి. పైగా ఏలూరు పోలీపులు రౌడీ షీట‌ర్ కేసు కేసు కూడా ఓపెన్ చేశారు. చింత‌మ‌నేని ఎన్ని గొడ‌వ‌లు చేస్తున్న పార్టీ నుండి మంద‌లింపులు ఉండ‌టం లేదు. చూడ‌బోతే పార్టీ నాయ‌కత్వ‌మే వెనుక‌వుండి ప్రోత్స‌హిస్తున్న‌ట్లు క‌న‌బ‌డుతోంది. ఇదంతా ఎంత కాలం లేండి మ‌హా అయితే మ‌రో తొమ్మిది నెల‌లే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జాతీర్పు ఎలా ఉండ‌బోతోందో చూడాల్సిందే. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: