పరిమితికి మించినది ఏదైనా ప్రమాదానికి సూచిక అని ఎన్నో సార్లు రుజువైంది.  గత కొంత కాలంగా పరిమితికి మించిన ప్రయాణాలు చేసిన ఏ ప్రయాణమైనా చివరికి అనర్థం జరిగిన సంఘటనలు చాలా జరిగాయి..అది నేల,నీరు, నింగి ఎక్కడైనా కావొచ్చు.  తాజాగా ఓ విమాన సిబ్బంది పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నందుకు భారీ మూల్యమే చెల్లించుకుంది. దక్షిణ సూడాన్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
south sudan
ఈ విమానంలో కేవలం 19 మంది మాత్రమే ప్రయాణం చేయడానికి అనుమతి ఉండగా, పరిమితికి మించి 23 మందిని ఎక్కించుకోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ ఫ్లైట్ జుబా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యిరోల్‌ నగరానికి బయలుదేరిన కమర్షియల్ విమానం కాసేపటికే ఓ సరస్సులో కుప్పకూలింది. జుబా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యిరోల్‌ నగరానికి బయలుదేరిన కమర్షియల్ విమానం కాసేపటికే ఓ సరస్సులో కుప్పకూలింది.
 
తీవ్ర గాయాలతో బయటపడిన నలుగురిలో ఆరేళ్ల బాలిక, మరో చిన్నారి, ఇటాలియన్ వైద్యుడు, ఓ యువకుడు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరిలో వైద్యుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: