ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో పటమట మోహన్‌దాస్‌ థియేటర్‌ ఎదురుగా పాత పోస్టాఫీస్‌ రోడ్డులో ఏర్పాటుచేసిన ఏబీసీ కాన్వెంట్‌-హైస్కూల్‌ వ్యవస్థాపకులు, ఉపాధ్యాయుడు ఆలూరి బుచ్చయ్య చౌదరి విగ్రహాన్ని శనివారం అవిష్కరించనున్న విషయం తెలిందే. సభా కార్యక్రమ నిర్వహణలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా, ఆహ్వానితులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అధికారులను ఆదేశించారు. తాగునీరు, సభావేదిక, రూట్‌మ్యాప్‌, పార్కింగ్‌ తదితర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. 


తాజాగా  ఏబీసీ కాన్వెంట్‌హైస్కూల్‌ వ్యవస్థాపకులు, ఉపాధ్యాయుడు ఆలూరి బుచ్చయ్య చౌదరి కాంస్య విగ్రహాన్ని పడమటలోని ఏబీసీ స్కూల్ క్యాంపస్ లో ఆవిష్కరించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు... ఈ సందర్భంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రూ. 5 లక్షల విరాళం అందించారు బుచ్చయ్య చౌదరి కుటంబ సభ్యులు.   లక్ష మందికి బుచ్చయ్య చౌదరి విద్య దానం చేశారని గుర్తుచేశారు.  2009లో బుచ్చయ్య చౌదరి మాస్టరును దారుణంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు.. బుచ్చయ్య చౌదరిని చంపేసినా ఆయన ఆశయాలను చంపలేరన్నారు.

Image result for ఆలూరి బుచ్చయ్య చౌదరి

కృష్ణా డెల్టా ఏమవుతుందోనని భయపడ్డాను.... కానీ, పట్టిసీమతో కరువును జయించామన్నారు చంద్రబాబు... విజయవాడ స్వచ్ఛ భారత్ లో రెండవ స్థానం వచ్చిందన్న ఆయన... నివాస నగరంలో విజయవాడ తొమ్మిదో స్థానం వచ్చిందన్నారు. నివాస నగరంలో విజయవాడ మొదటి స్థానంలో ఉండాలన్నదే తన ఆశయం అన్నారు చంద్రబాబు.  కాగా,  పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: