ముఖ్య‌మంత్రి విధానాల‌ను లేక‌పోతే అధికార పార్టీ చ‌ర్య‌ల‌ను ప్ర‌తిప‌క్షాలు ఫాలో కావ‌టం చూస్తుంటాం. కానీ ఏపిలో మాత్రం ప‌రిస్దితి విచిత్రంగా రివ‌ర్వులో న‌డుస్తోంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హామీల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఫాలో అవుతున్నారు. ఈ విష‌యం గ‌తంలో ఎన్నోసార్లు రుజువైనా తాజాగా మ‌రోసారి నిరూపితమ‌వ్వ‌టం గ‌మ‌నార్హం.


ఇంత‌కీ విష‌యం ఏమిటంటే, ప్ర‌త్యేక‌హోదా ఉద్య‌మంలో న‌మోదైన కేసుల‌ను ఎత్తేసేందుకు చంద్ర‌బాబు సానుకూలంగా స్పందిచారు. కేసుల ఎత్తివేత‌పై ఈరోజు అఖిల‌ప‌క్ష స‌మావేశం జ‌రిగింది లేండి. ఆ స‌మావేశంలో నేత‌ల సూచ‌న‌లు, స‌ల‌హాలు విన్న త‌ర్వాత చంద్ర‌బాబు కేసుల ఎత్తివేత‌కు హామీ ఇచ్చార‌ట‌. పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్ ప్ర‌త్యేక‌హోదా ఉద్య‌మంలో పెట్టిన కేసుల‌ను ఎత్తేస్తానంటూ హామీ ఇచ్చిన సంగ‌తి అంద‌రికీ గుర్తుండే ఉంటుంది.  


స‌మైక్య రాష్ట్ర కోసం 2014 ప్రాంతంలో జ‌రిగిన ఉద్య‌మాల్లో ప్ర‌స్తుత ఏపిలో ఆందోళ‌న‌కారుల‌పై  వేలాది కేసులు న‌మోద‌య్యాయి. ఆ కేసుల ఎత్తివేత‌పై ఎన్నిమార్లు చంద్ర‌బాబును క‌ల‌సిన పెద్ద‌గా స్పందించ‌లేదు. అప్ప‌ట్లో  కేసులు న‌మోదైన వారు ఇపుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేప‌ధ్యంలోనే వారిలో కొంద‌రు పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్ క‌లిశారు. వారి వాద‌న విన్న జ‌గ‌న్ అధికారంలోకి రాగానే  కేసుల ఎత్తివేత‌కు హామీ ఇచ్చారు. అదే విష‌యాన్ని  దృష్టికి తీసుకెళ్ళ‌గానే వెంట‌నే చంద్ర‌బాబు కూడా సానుకూలంగా  స్పందించటం గ‌మ‌నార్హం. 


అంటే కేసుల ఎత్తివేత‌కు జ‌గ‌న్ హామీ ఇచ్చిన త‌ర్వాత కానీ చంద్ర‌బాబు మేల్కోలేదు. అదే విధంగా గ‌తంలో కూడా అంగ‌న్ వాడి టీచ‌ర్లు, ఆశా వ‌ర్క‌ర్లు త‌దిత‌రుల‌కు కూడా జీతాలు పెంచ‌టానికి జ‌గ‌న్ హామీ ఇచ్చారు. వెంట‌నే చంద్ర‌బాబు  వారికి జీతాలు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  ఏదేమైనా త్వ‌ర‌లో ఎన్నిక‌లు రాబోతున్నాయి క‌దా ? ఇంకెన్ని విచిత్రాలు చూడాలో చంద్ర‌బాబు పాల‌న‌లో ?


మరింత సమాచారం తెలుసుకోండి: