విభజన ఏపీలో కాపులు నిర్ణయాయత్మక శక్తిగా ఉన్న విషయం తెలిసిందే. మొత్తం జనాభాలో పదిహేను నుంచి ఇరవై శాతం వరకు ఉన్న కాపులు దాదాపుగా డెబ్బయి అసెంబ్లీ సీట్లలో గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారని అంటారు. ఇంతటి బలమైన సామాజికవర్గం రేపటి రోజున ఏ పార్టీకి జై కొట్టబోతోంది. ఇది ఇంటెరెస్టింగ్ మ్యాటరే మరి.


బాబుపై గుస్సా :


ఏపీలో అధికార తెలుగుదేశంపై కాపులు గుస్సాగా ఉన్నారు. ఆ సంగతి అందరికీ తెలిసిందే. ఎందుచేతనంటే పోయిన ఎన్నికల్లో కాపులను బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చి మరీ బాబు వారిని పట్టించుకోలేదు. చివరికి ఎన్నో ఉద్యమాలు చేసిన తరువాత మంజునాధ కమిషం వేయడం ఆ నివేదిక పేరిట హడావుడి చేసి తూతూ మంత్రంగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. దానిని కేంద్రానికి పంపించి చేతులు దులుపుకున్నారు. దీంతో కాపులు రిజర్వేషన్ల కధ అటకెక్కింది.


వైసీపీ ఇలా :


మరో వైపు రేపటి రోజున అధికారంలోకి వద్దామని అనుకుంటున్న వైసీపీ కాపుల రిజర్వేషన్ విషయంలో తన మాటను సూటిగానే బయటపెట్టింది. కేంద్ర పరిధిలో ఈ అంశం వుందని జగన్ డైరెక్ట్ గానే  చెప్పేసారు. కాపుల కోసం పదివేల కోట్లతో కార్పోరేషన్ ద్వారా ఇస్తామని చెప్పారు. దానిపై ముద్రగడ ఫైర్ అయ్యారు కూడా. దాంతో వైసీపీకి మద్దతు అన్నది కాపుల నుంచి  అనుమానమేనని  అంటున్నారు.


జనసేన వైపేనా :


ఇక కాపు సామజిక వర్గం రిజర్వేషన్ల కధ బయటకు నడిపిస్తున్నా వారికి రాజ్యాధికారం కావాలి. అధిక జనాభా ఉండి కూడా ఇప్పటికీ సీఎం సీటు దక్కకపోవడం వారికి అవమానంగా ఉంది. దాంతో జనసేన నాయకుడు తమ సామాజిక వర్గం వారు కావడంతో ఆయనతో  వచ్చే  ఎన్నికల్లో పనిచేయాలని కాపునాడు నాయకులు భావిస్తున్నారుట.

దీనికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకునేందుకు తొందరలోనే కాపునాడు నాయకులు మీటింగు పెట్టుకుంటున్నారని భోగట్టా. ముద్రగడ పద్మనాభం నివాసంలో ఒకటి రెండు రోజుల వ్యవధిలో జరిగే ఈ మీటింగ్ లో షాకింగ్ డెసిషన్లు ఉంటాయట. చూడాలి. మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: