ఏపీ సీఎం టిడిపి అధినేత చంద్రబాబు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్రవాసాంధ్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను తీసుకువచ్చిన సాఫ్ట్ వెర్ కంపెనీల వల్లే ఇప్పుడు మీరు ఇక్కడ ఉద్యోగాలు చెయ్యగలుగుతున్నారు అని పేర్కొన్నారు.

Related image

ప్రస్తుతం విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రవాసాంధ్రలను ఉద్దేశించి పేర్కొన్నారు చంద్రబాబు. ప్రస్తుతం ప్రపంచంలో చాలాచోట్ల తెలుగువారు పెద్ద పెద్ద స్థానాలలో ఉన్నారని..ముఖ్యంగా అమెరికాలో తెలుగు ప్రజల హవా స్పష్టంగా కనబడుతోందని అన్నారు.

Image result for chandrababu

ఈ క్రమంలో  అమెరికాలో స్థిరపడిన ప్రతి ఒక్కరు తమ జన్మ భూమి కోసం ఏదో ఒకటి చేయాలని..కుదిరితే గ్రామాలను దత్తత తీసుకోవాలని అక్కడున్న వారికి చంద్రబాబు సూచించారట. హత్యలకు, విధ్వంసానికి ప్రజాస్వామ్యంలో తావులేదని.. ప్రజాప్రతినిధుల హత్యలను అందరూ ఖండించాలని చంద్రబాబు అన్నారు.

Image result for chandrababu

ప్రాణం పోసే ప్రతిభ లేనప్పుడు, ప్రాణం తీసే హక్కు కూడా ఎవరికి లేదని స్పష్టం చేశారు. నిర్మాణమే అందరి బాధ్యత కావాలి తప్ప.. విధ్వంసం అవ్వకూడదని అన్నారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోము హత్యలను ఖండించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గతంలో లోకేష్ అమెరికా వచ్చినప్పుడు ఎటువంటి స్పందన ఇచ్చారు ఇప్పుడు అదే స్పందన ఇవ్వడం చాలా సంతోషం గా ఉందని అన్నారు చంద్రబాబు.




మరింత సమాచారం తెలుసుకోండి: