ఎన్నికలకు యువతకు గట్టి సంబంధమే ఉంది. వారి ఉత్సాహాన్ని బాగా వాడుకుంటారు. వారినే ప్రచార సారధులుగా పెట్టుకుంటారు. ఇంకా చెప్పాలంటే వారి ఓట్లతోనే రాజకీయమూ చేస్తారు. కానీ అసలు విషయానికి వచ్చేసరికి మాత్రం ఉత్త చేతులు చూపిస్తారు. అందుకే మన దేశంలో వ్రుద్ధతరమే కీలక పదవుల్ల్లో ఉంటోంది. మరి దీనిని మారుస్తానంటోంది ఆ పార్టీ 


యువతకే పెద్ద పీట :


వచ్చే ఎన్నికల్లో యువతకు పెద్ద పీట వేయాలని జగన్ డిసైడ్ అయ్యారని టాక్. ఏపీలో యాభై శాతానికి పైబడి ఉన్న యూత్ ని ఆకట్టుకోవడానికి ఆయన ఈ ప్లాన్ అమలు చేస్తున్నారుట. మెరికల్లాంటి యువకులకు 2019 ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని అనుకుంటున్నారుట. తన పార్టీలో మెజారిటీ టికెట్లు యువతకేనని జగన్ ప్రతిపాదిస్తున్నారని భోగట్టా.


అదే వ్యూహం :


యువతకు టికెట్లు ఇవ్వడం ద్వారా ఆయా వర్గం ఓట్లను గుత్తమొత్తంగా పట్టేయడమే కాదు, వారి పదునైన ఆలోచనలతో పార్టీకి కూడ కొత్త లుక్ వస్తుందని భావిస్తున్నారు. అదే విధంగా యువతలో నిజాయతీ పాలు ఎక్కువ. ఆవేశమూ ఎక్కువే. వారిని కనుక ఎమ్మెల్యేలను, ఎంపీలను చేస్తే రేపటి రోజున ఫిరాయింపులకు కూడా పెద్దగా చాన్స్ ఉండదని జగన్ థింక్ చేస్తున్నారుట.


సెలెక్షన్ అలాగే :


జగన్ పాదయాత్రలో కూడా యుత నాయకత్వానికే పెద్ద పీట వేస్తున్నారు. వారినే ఇపుడు ఎక్కువగా ఇంచార్జులుగా నియమిస్తున్నారు. రేపటి ఎన్నికల్లోనూ మీకే టికెట్ అంటూ భరోసా  కల్పిస్తున్నారు. జగన్ స్వతహాగా యువకుడు కావడం, పార్టీలోనూ యువతకు అగ్ర తాంబూలం ఇస్తే కనుక ఆ జోష్ వేరుగా ఉంటుందని, ఫ్రెష్ నెస్ తో మంచి రిజల్ట్స్ కూడా వస్తాయని అనుకుంటున్నారుట.


వారిది అనుభవం :


ఇక సీనియర్లను కూడా ఎక్కడా వదిలేయకుండా వారి అనుభవాన్ని పార్టీ అభివ్రుధ్ధి కోసం ఉపయోగించుకోవడంతో పాటు కీలకమైన చోట్ల తీసుకోవాలని జగన్ ప్లాన్ చేస్తున్నారుట. ఇలా రెండు వర్గాలనూ అక్కున చేర్చుకోవడం ద్వారా సమతూల్యత పాటించాలని, అదే విజయం తెచ్చిపెడుతుదని వైసీపీ ఆలొచిస్తోంది. . చూడాలి ఈ ప్రయోగం ఎంతవరకూ ముందుకెల్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: