నందమూరి తారక రామారావు సుపుత్రుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి బామ్మర్ది వియ్యంకుడు టాలీవుడ్ నటుడు హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ తన సహజ స్వరూపం బయటబెట్టి నిష్కారణంగా ఒక అమాయకుడైన అభిమానిపై తన చేతికి పనిచెప్పారు సారీ కాలికి పని చెప్పారు. అభిమానంతో దగ్గరకు వచ్చిన అభిమాని పై తన ప్రతాపం చూపారు. కాలుతో తన్ని అభిమాన గణానికి ఆగ్రహం తెప్పించారు. 
Image result for balakrishna atrocities in public
ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న నందమూరి బాలయ్య తల్లాడ మండలం మిట్టపల్లి వద్ద ఒక అభిమాని టిడిపి కార్యకర్తపై అసహనానికి గురయ్యారు. దీంతో కాదు దిగి మరీ కాలుతో తన్నాడు. దీంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో అభిమానంతో చూసేందుకు వచ్చిన అభిమానులను తంతారా? అంటూ కోపం తో బాలకృష్ణ ఫ్లెక్సీలను అక్కడికక్కడే తగలెట్టారు.  


ఈ మధ్య ఈ బాలయ్య జనాలపై దూసుకొస్తూ చేతికి పని చెపుతూ చెంప దెబ్బలతో జనాన్ని భయబ్రాంతుల్ని చేస్తున్నారు. రీల్ లైఫ్ లో అభిమానులే తన ప్రత్యక్ష దైవా లంటూ లెక్చర్లు దంచే ఈ మహానుభావుడు  అభిమానంతో దగ్గరకు వస్తున్న వారిని ప్రేమగా దగ్గరకు తీసుకున్నా, కనీసం చిరునవ్వు ప్రదర్శించినా, సరిపోయేదానికి వారిని చెంపచెళ్లు మనిపించడం లేదా కాలుతో తన్నడం చేస్తూ అభిమానుల ఆగ్రహానికి గురౌతున్నారు. అవేశాన్ని తట్టుకోలేకో లేక తన అభిమానులే కదా! అనో తెలియదు కానీ ఎక్కడపడితే అక్కడ బాలయ్య అభిమానుల చెంపలు పగలగొట్టటం పూల దండవెయ్యటానికి వచ్చిన, నమస్కారం పెట్టడానికొచ్చినా, సెల్ఫీ దిగేందుకు వచ్చినా బాలయ్య ది ఒకటే సమాధానం  అదే చెంప పగలగొట్టటం లేదా డొక్కలో కాలితో తన్నటం. ఇటీవలి కాలంలో బాలయ్య బహిరంగంగా తన అభిమానులపై చెయ్యి చేసుకున్న ఘటన లు అనేకం లెక్కకు మిక్కిలి.   
Image result for balakrishna atrocities in public
గతంలో తన శాండిల్స్ విప్పలేదని తన అసిస్టెంట్ ను కొట్టి వార్తల్లోకెక్కారు బాలయ్య. అలాగే నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ కార్యకర్తపై చెయ్యిచేసు కుని మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత తన సొంత నియోజకవర్గమైన హిందూపురంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ కార్యకర్త చెంప చెళ్లు మనిపించారు. 
Image result for balakrishna atrocities in public
అభిమానుల గూబగుయ్యమనేలా వీరకొట్టుడు కొడుతున్న బాలయ్య అదే రీతిలో తాను కొట్టిన చెంపదెబ్బలను సమర్ధించుకుంటున్నారు కూడా. గతంలో ఒక అభిమానిని కొట్టిన సందర్భంలో సోషల్ మీడియా బాలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది.  దీంతో స్పందించిన బాలయ్య ఎవరెన్ని రాసినా డోంట్-కేర్, నా అభిమానులని అడగండి, వాళ్లే చెబుతారు. రేయ్ నిను తిట్టాడా? నన్ను కొట్టాడురా? అంటూ గొప్పగా ఫీలవుతారని చెప్పుకొచ్చాడు. నా చేయి తగిలితే వాడికొక అనందం అంటూ సమర్థించుకున్నారు కూడా రాసే వాళ్ళకేమీ తెలుసు వాళ్ల బొంద అంటూ సెటైర్ కూడా వేశారు.  
Image result for balakrishna atrocities in public
అంత‌టితో ఆగిపోలేదు, అనవసరంగా నేను కొట్టను, అవతలోడు రెచ్చగొట్టినా, తప్పు చేసినా అప్పుడు ఆలా జరుగుతుందని అన్నాడు. ఇదంతా నాకు అభిమానులకి మధ్య ఎప్పుడూ ఉండే తంతేనని అన్నారు. మధ్యలో ఎవరడ్డొచ్చినా  వాడికి ట్రీట్మెంట్ వేరుగా ఉంటుందని ఇండైరెక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు. రీల్-లైఫ్‌లో పంచ్ డైలాగులు, ఫైట్స్‌తో అభిమానులను అలరించే బాలకృష్ణ, రియ‌ల్ లైఫ్‌లో అభిమానులపై సంయమనం కోల్పోయి చెంపదెబ్బలు కొడితే ఆగ్రహానికి గురికావాల్సిందేనని గుసగుసలు వినపడుతున్నాయి. 
Image result for balakrishna atrocities in public
హిందూపురం, నంద్యాలలో బాలకృష్ణ చెంపదెబ్బలకు బలైన వాళ్లు నిశబ్ధంగా ఉన్నా,  విప్లవాల ఖిల్లా ఖమ్మం జిల్లాలో అది నాగరికత ప్రజా హక్కులు తెలిసిన తల్లాడలో మాత్రం ఊరుకోలేదు. అభిమానంతో దగ్గరకొస్తే కాలుతో తంతారా? అంటూ పోస్టర్లను తగులబెట్టి తమ ఆగ్రహాన్ని చూపించారు. ఇక పచ్చమీడియా మాత్రం బాలకృష్ణ  ముక్కోపి అని చిన్నపిల్లడి మనస్తత్వం అని, ప్రధమ ఒకపి అని – అంతేగాని చాల మంచివాడని రాస్తాయి.  అసలోళ్ళకంటే వాళ్ళని వెనకేసుకొచ్చే వీళ్ళ తంతు జాతికి చేసే హాని అంతా ఇంతా కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: