ఇపుడీ మాట ఏపి రాజకీయవర్గాల్లో బాగా వైరల్ గా మారిపోయింది. ఎందుకంటే, నాలుగు రోజుల క్రితం రాష్ట్రంలో పలువురు వ్యాపారస్తులు, నిర్మాణరంగ సంస్ధల యాజమాన్యాలపై పెద్ద ఎత్తున ఐటి దాడులు జరిగిన విషయం తెలిసిందే. సరే, ఆ దాడుల్లో ఏం బయటపడిందన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే అనుకోండి అది వేరే సంగతి. ఇదే విషయమై సోషల్ మీడియాలో ఒక విషయం బాగా వైరల్ గా మారింది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే మొన్నటి ఐటి సోదాల్లో ఎంతమంది మీద దాడులు చేద్దామని అనుకున్నారో ? ఎవరెవరిపై దాడులకు ప్లాన్ చేశారో తెలీదు. అయితే మంత్రి నారాయణ ఇంటిదాకా వెళ్ళి వెనక్కు తిరిగివచ్చేసిన విషయం తెలిసిందే. తర్వాత రెండు రోజుల పాటు ఐటి దాడులు జరిగినా మళ్ళీ నారాయణ ఇల్లు, వ్యాపార సంస్ధలపైకి వెళ్ళలేదు. అయితే, పలు వ్యాపార సంస్ధలపైన, నిర్మాణ రంగ సంస్దలపైన దాడులు చేసి పలు డాక్యుమెంట్లను, లాకర్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

ఈ నేపధ్యంలో త్వరలో మళ్ళీ దాడులకు ఐటి అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈసారి దాడుల్లో కీలకమైన నేతలతో పాటు ఇద్దరు ముగ్గురు ఉన్నతాధికారులు, పెద్ద నిర్మాణ సంస్ధల యాజమాన్యాలున్నాయని ప్రచారం జరుగుతోంది. కీలకమైన నేతలంటే బహుశా మంత్రులు, ఎంపిలు,  ఎంఎల్ఏలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే, చాలా మంది ప్రజాప్రతినిధులు అడ్డదిడ్డంగా సంపాదించేశారు. వారికి చాలా మంది ఉన్నతాధికారులు వత్తాసుగా నిలిచారు. అందుకే ముందుంది మొసళ్ళ పండుగ అంటూ ఐటి ఉన్నతాధాకారులు వ్యాఖ్యానించినట్లుగా ఓ సమాచారం వైరల్ గా మారింది. దాంతో టిడిపి మంత్రులు, నేతలు ఐటి దాడులంటేనే ఉలిక్కిపడుతున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: