పవన్ కళ్యాణ్ 2014 లో టీడీపీ బీజేపీ కూటమి కి మద్దతు ఇచ్చి చంద్ర బాబు ను ఏకంగా సీఎం ను చేసేసాడు అయితే పవన్ ప్రతి మీటింగ్ లో చంద్ర బాబుకు పోయిన ఎన్నికల్లో మద్దతు ఇచ్చి తప్పు చేశానని పదే పదే చెబుతున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు తాను మద్దతివ్వకుండా ఉండివుంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి పీఠంపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కూర్చొనివుండేవారని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కానీ, ఆ ఎన్నికల్లో చంద్రబాబును గుడ్డిగా నమ్మి ఆయనకు మద్దతిచ్చి అతిపెద్ద తప్పు చేసినట్టు చెప్పుకొచ్చారు.


పవన్ మాటలు అర్ధం కాక తలలు పట్టుకుంటున్న ప్రజలు..!

 ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 2014 ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు మద్దతిచ్చాను, తప్పు చేశానని బాధపడుతున్నానన్నారు. తాను మద్దతివ్వడం వల్ల అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలు ఇపుడు రూ.వేల కోట్లు దోచుకుతింటున్నారని, సీఎం చంద్రబాబు డబ్బే ప్రధానంగా పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. డబ్బే ప్రధానం అనుకుంటే అంబానీ ప్రధాని అయ్యేవారని వ్యాఖ్యానించారు. 

పవన్ మాటలు అర్ధం కాక తలలు పట్టుకుంటున్న ప్రజలు..!

 ముఖ్యమంత్రి తనయుడు లోకేష్‌ రాష్ట్రంలో 14 వేల కిలోమీటర్లు రోడ్లు వేశామని చెబుతున్నారని, అయితే జంగారెడ్డిగూడెం నుంచి ఐఎస్‌ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ట్రాఫిక్‌ లేని సమయంలో 14 కిలోమీటర్లు వెళ్లేందుకు తనకు 40 నిమిషాలు పట్టిందని, దీన్నిబట్టి రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోందన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: