భారత దేశ వ్యాప్తంగా విజయదశమి వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటారన్న విషయం తెలిసిందే.  ఇక మైసూర్ లో జరిగే దసరా వేడుకలు మరింత ఘనంగా ఉంటాయి. మైసూరులో జరిగే దసరా ఉత్సవాలు కర్ణాటక రాష్ట్ర పండుగ (నదహబ్బ). ఈ నవరాత్రి ఉత్సవాలు విజయదశమితో కలిపి పదిరోజులు వరుసగా జరుపుకుంటారు. ఎక్కువగా దసరా పండుగ సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో వస్తుంది. హిందూ పురాణాలను అనుసరించి విజయదశమి చెడుపై మంచి విజయానికి సంకేతంగా జరుపుకుంటారు.

తొమ్మిదిరోజులు వివిధ అవతారాల్లో మహిషాసురుని సేనలను నాశనం చేసిన పరాశక్తి తొమ్మిదోరోజున మహిషాసురుణ్ణి సంహరించింది.  15వ శతాబ్దంలో విజయనగర రాజులు దసరా ఉత్సవాలు నిర్వహించడం ప్రారంభించారు.  దీనికి మనకు చారిత్రక ఆధారులు కూడా లభిస్తున్నాయి. పర్షియాకు చెందిన రాయబారి అబ్దుర్ రజాక్ తన పుస్తకం మట్లా-ఉస్-సదైన్ వా మజ్మా-ఉల్-బహ్రెయిన్  అనే పుస్తకంలో విజయనగర సామ్రాజ్యంలో రాజులు జరిపిస్తున్న దసరా ఉత్సవాల గురించి రాసుకున్నారు. 
దస్త్రం:Mysore Dasara procession.jpg
తెలుగు జాతి గర్వించే విధంగా విజయనగర సామ్రాజ్య పాలన జరిగింది.  విజయనగర రాజ్యపాలనలో కళలు, కళాకారులు వైభవంగా గడిపిన చారిత్రక సత్యాలు కనిపిస్తాయి.  అంతే కాదు విజయనగర సామ్రాజ్య పాలన పై ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి.  అబ్దుర్ రజాక్ తన పుస్తకంలో 1304-1470 వరకు ఆయనకు తెలిసిన ప్రపంచ చరిత్ర గురించి రాశారు. అలా మనకు 15వ శతాబ్దం కన్నా ముందే దసరా ఉత్సవాలు ఘనంగా జరిగేవని తెలుస్తుంది.   విజయనగర సామ్రాజ్య పతనం తరువాత మైసూరు రాజులైన ఉడయార్లు మైసూరుకు దగ్గర్లో ఉన్న శ్రీరంగపట్నలో దసరా ఉత్సవాలు ప్రారంభించారు.

రాజా ఉడయార్  (1578-1617) 1610లో ఈ ఉత్సవాలను మొదలుపెట్టారు.  ఈ పదిరోజులూ మైసూరు ప్యాలెస్, చాముండీ కొండ దీప కాంతుల్లో వెలిగిపోతుంది.  1805లో కృష్ణరాజ ఉడయార్ సమయం నుండి దసరా సమయంలో మైసూరు ప్యాలస్ లో ప్రత్యేక రాజదర్బారు నిర్వహించడం మొదలుపెట్టారు. ఆ తరువాత అది ఆచారంగా మారిపోయింది.  నవరాత్రుల్లో తొమ్మిదో రోజైన మహర్నవమి నాడు ఈ రాచఖడ్గాన్ని ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో కలిపి ఊరేగింపుగా తీసుకువచ్చి, పూజలు చేస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: