మరి మూడవ అయనకు చోటెక్కడ. అసలు ఆయన కదా మరో మారు ముఖ్యమంత్రి పీఠం ఎక్కాల్సింది. అధికారం కాకపోతే ప్రతిపక్షం అయినా  ఇవ్వరా. అంత ఘోరంగా జనం తీర్పు ఉంటుందా. ఇది ఇలాగే జరుగుతుందా. ఆశ ఉండాలి కానీ హద్దు మీర కూడదుగా. 


కొత్త రాజకీయమట : 


వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది అక్షరాలా జరిగితీరుతుందంటున్నారు. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన పవన్ కి జనం ప్రతిపక్ష స్థానం ఇస్తారని, మాట నిలబెట్టుకునే జగన్ కు సీఎం కుర్చీ అప్పగిస్తారని వైసీపీ ప్రచార విభాగం ఆధ్యక్షుడు   విజయచందర్ అంటున్నారు. ఎట్టి  పరిస్తితుల్లోనూ ప్రజలు చంద్రబాబుకు అధికారమూ ఇవ్వరు, ప్రతిపక్షమూ ఇవ్వరని ఆయన ధీమాగా చెబుతున్నారు.


జనం నాడి అది :


తాను జగన్ తో పాదయాత్రలో పాలుపంచుకున్నపుడు జనం నాడి చూశానని, వారి స్పందన అలాగే ఉందని విజయచందర్ అంటున్నారు. అంచనాలు, సర్వేలను మించిపోయి జనంలో జగన్ ఆదరణ రోజు రోజుకూ పెరుగుతోందని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కి 125 సీట్లకు మించి వస్తాయని కూడా జోస్యం చెప్పారు.  టీడీపీని ప్రజలు పక్కన పెడతారని అన్నారు. 


కొత్త ఒరవడి :


నాయకులు అంటే తాము స్పీచులు ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు, జనం గురించి వినాలి, వారు చెప్పింది ఓపిగ్గా చెవికి ఎక్కించుకోవాలి. జగన్ అదే చేస్తున్నారని విజయచందర్ అంటున్నారు. పాదయాత్రలో జగన్ వాళ్ళ చేతనే మాట్లాడించి విషయాలు అన్నీ తెలుసుకుంటున్నారని, ఇంతటి  ఓర్పు కలిగిన నాయకుడు తమకు కావాలని జనమే అంటున్నారని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అధికారమూ, ప్రతిపక్షమూ కూడా దక్కదని ఈ సినీ నటుడు ఢంకా భజాయిస్తున్నారు. మరి అదే జరిగితే పసుపు పార్టీ తట్టుకొగలదా.. చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: